పశ్చిమగోదావరి

ఖాతాదారు దస్తావేజు కన్పించడం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకివీడు, సెప్టెంబర్ 26: ఆకివీడులోని కార్పొరేషన్ బ్యాంకు మరోసారి తెరమీదకు వచ్చింది. గతంలో ఈ బ్యాంకులో బంగారం మాయమైన సంఘటన ఖాతాదారులు మరువక ముందే మరోసారి బ్యాంకులో రుణం కోసం పెట్టిన దస్తావేజులు మాయమయ్యాయి. ఆకివీడుకు చెందిన అల్లూరి సూర్యకుమారి పేరు మీద ఉన్న ఎంపైర్ టవర్స్ ప్లాట్ నెంబర్ 203 దస్తావేజులను 2013 జూన్ 19వ తేదీన బ్యాంకులో తనఖా పెట్టి రూ.10 లక్షల రుణాన్ని తీసుకున్నారు. ప్రతీ నెల వాయిదా రూ.11,500 చెల్లిస్తూ వస్తున్నారు. అయితే ప్లాట్‌కు మరో విద్యుత్ కనెక్షన్ పెట్టుకునేందుకు గతేడాది దస్తావేజులు జిరాక్సులు ఇమ్మని బ్యాంకు అధికారులను ఖాతాదారు సూర్యకుమారి కోరారు. అయితే బ్యాంకు అధికారులు దస్తావేజులు కనపడటం లేదంటూ నాన్చుడు ధోరణి ప్రదర్శించారు. అయితే తదనంతరం బంగారం మాయమైన సంఘటనతో ఈ విషయం గోప్యంగా ఉంచారు. మరల బ్యాంకు అధికారులను సూర్యకుమారి భర్త అల్లూరి సత్యనారాయణరాజు తాము మొత్తం రుణం చెల్లించేస్తామని, తమ దస్తావేజులు కావాలని కోరడంతో మళ్లీ బ్యాంకు అధికారులు పాత విషయానే్న ప్రస్తావించడం జరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం మరోమారు బ్యాంకు వద్దకు వెళ్ళి మేనేజర్ ఎ. ఫణికుమార్‌ను వివరాలు అడిగారు. ఈ నేపథ్యంలో మేనేజర్ ఫణికుమార్ కనిపించడం లేదని, అయితే విద్యుత్ కనెక్షన్ కోసం జిరాక్స్ అడిగిన నేపథ్యంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి డాక్యుమెంట్‌లను తీసుకున్నామని ఇవ్వడానికి ప్రయత్నించారు. దీంతో ఖాతాదారుని భర్త సత్యనారాయణరాజు, జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడు బొబ్బిలి బంగారయ్యలు బ్యాంక్ అధికారులను నిలదీశారు. బ్యాంకు కార్యకలాపాలు ఈ విధంగా సాగితే ఖాతాదారులకు బ్యాంకుపై నమ్మకం ఉంటుందా అని ప్రశ్నించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై కడియాల అశోక్‌కుమార్ బ్యాంక్ వద్దకు వచ్చి మేనేజర్‌తో మాట్లాడారు. మేనేజర్ ఫణికుమార్ రెండు రోజులు గడువు ఇస్తే దస్తావేజులు ఖాతాదారునికి అప్పగిస్తానని హామీ ఇచ్చారు.