పశ్చిమగోదావరి

రాష్ట్రంలో కళలకు ఎనలేని గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 26 : కళలను, ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను గౌరవించే మనస్తత్వం గల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజయవాడలో ఏర్పాటుచేయనున్న ఘంటసాల మ్యూజియంకు కోటిన్నర రూపాయలు విడుదలచేశారని ఎపి ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. సోమవారం రాత్రి కెవి ఎస్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏలూరు అగ్రహారంలోని వై ఎంహెచ్ ఏ హాలులో కెవి ఎస్ ఎక్స్‌లెన్స్ అవార్డు-2016 బహుకరణ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో కంటే ఇతర రాష్ట్రాల్లో కళలకు ఎక్కువ గౌరవం వుందని, అదే గౌరవం మన రాష్ట్రంలో కూడా రావాలనే ఉద్దేశ్యంతోనే సంస్కృతి, సంప్రదాయాలకు చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. కళలను ఆదరించిన ప్రభుత్వాలే నిలబడతాయన్నారు. కూచిపూడి నాట్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత ఏలూరునకు చెందిన కెవి సత్యనారాయణకే దక్కిందని అన్నారు. రంగస్థలంపై శ్రీకృష్ణదేవరాయలు పాత్రను కెవి సత్యనారాయణ అత్యద్భుతంగా ప్రదర్శించారని, స్థిరస్థాయిగా నిలచిపోయారని అన్నారు. బాల మురళీకృష్ణ, ఎం ఎస్ సుబ్బలక్ష్మి, ఘంటసాల, శ్రీకృష్ణదేవరాయలు వంటి వ్యక్తులను నేటికి కూడా సమాజంలో గుర్తిస్తున్నారంటూ, కళలను బట్టి గుర్తింపు ఏర్పడిందన్నారు. కళకు భగవత్సంకల్పమేనని అన్నారు. జాతీయ సంపద, ఔన్నత్యం కళాకారులేనని అన్నారు. కళాకారులుగా గుర్తింపు వున్న శ్రీకృష్ణ దేవరాయలు, రాజరాజ నరేంద్రుడు, అక్బర్, భోజరాజు తదితరులను నేటికీ గుర్తుకు తెచ్చుకుంటున్నామంటే వారికి కళల పట్ల వున్న ఆసక్తేనని అన్నారు. కూచిపూడి నాట్యాన్ని ప్రపంచ పటంలో వుండాలనేదే చంద్రబాబు ఆశయమని అన్నారు. కళారత్న డాక్టర్ కెవి సత్యనారాయణకు, తనకు వున్న అనుబంధాన్ని బట్టే ప్రతీ జన్మదిన వేడుకలకు తాను విచ్చేస్తున్నానని బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ అధ్యక్షత వహించారు. మాజీ మంత్రి మరడాని రంగారావు, ఉష పిక్చర్స్ అధినేత వివి బాలకృష్ణారావు, ఏలూరు ఆర్‌డివో నంబూరి తేజ్‌భరత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొచ్చిన్‌కు చెందిన నాట్య విశారద అనుపమ మోహన్‌కు కెవి ఎస్ అవార్డును అందజేసి మెమెంటోను బహూకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన నాట్య చూడామణి డాక్టర్ సిహెచ్ అజయ్‌మోహన్, నృత్య కౌముది నదియా, నాట్యాచార్య సురేంద్రలు నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు సభికులను ఆకట్టుకున్నాయి. నాట్య ప్రపూర్ణ గండికోట రాజేష్ శిష్య బృందం నిర్వహించిన కూచిపూడి, జానపద, ఆధ్యాత్మిక నృత్యాల పట్ల సభికులు ముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా వక్తలు కళారత్న డాక్టర్ కెవి సత్యనారాయణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.