పశ్చిమగోదావరి

ప్రజల ఆరోగ్యం కోసమే సియం తపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లింగపాలెం, సెప్టెంబర్ 26: రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో సిఎం చంద్రబాబునాయుడు దోమలపై దండయాత్ర, పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రం లింగపాలెంలో మంత్రి దోమల నివారణా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీ పాల్గొన్నారు. ఈ ర్యాలీలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి సుజాత మాట్లాడుతూ దోమల వల్ల తొమ్మిది రకాల ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయని, వీటిని నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. దోమల నివారణ మన చేతుల్లోనే ఉందన్నారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా ఉంచాలంటే ప్రజా భాగస్వామ్యం ఎంతైనా ముఖ్యమన్నారు. ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందనే భావనను విడనాడి, పరిశుభ్రతపై ప్రజలు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మురుగునీరు నిల్వ ఉండకుండా, చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు పెరగకుండా గ్రామ పంచాయతీలే చర్యలు తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం పంచాయతీలకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందన్నారు. ఎక్కడైనా మురుగునీరు నిల్వ ఉందని తన దృష్టికివస్తే కఠిన చర్యలు తీసుకుంటానని అధికారులను మంత్రి సుజాత హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు పారిశుద్ధ్య మెరుగుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థుల నుండి పలు సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు. ధర్మాజీగూడెం సాయి డిగ్రీ కళాశాలలో ఇంటర్ చదువుతున్న పి తులసి పలు సందేహాలు, సలహాలు ఇవ్వడంతో పలువురు ఆశ్చర్యపోయారు. దీంతో మంత్రి సుజాత ఆ విద్యార్థిని అభినందించారు. ఇటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ చేపట్టి గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. అనంతరం మంత్రి సుజాతే స్వయంగా డ్రెయినేజీలో చెత్తను తొలగించి, దానిని తట్టతో తీసుకువెళ్లి దూరంగా విడిచిపెట్టారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జి సాయివరప్రసాద్ (పెదబాబు), ఎంపిపి ఎం మల్లికార్జునరావు, సర్పంచ్ కె శ్రీహరి, ఎంపిడిఒ కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.