పశ్చిమగోదావరి

దోమలపై విద్యార్థులకు ప్రత్యేక పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 26 : జిల్లాలో పదవ తరగతి లోపు విద్యార్ధినీ విద్యార్ధులకు దోమలపై పరీక్షలు నిర్వహించి 50 మార్కులు సైన్స్ సబ్జెక్టులో కలుపుతామని కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా విద్యాశాఖ ప్రచురించిన దోమలపై దండయాత్ర - పరిసరాల పరిశుభ్రత ప్రచార పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 1వ తేదీన జిల్లాలోని విద్యార్ధినీ విద్యార్ధులకు దోమలు, పరిసరాల పరిశుభ్రతపై 50 మార్కులకు ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తామని, ఈ పరీక్షలో వచ్చిన మార్కులను వార్షిక పరీక్షలో పరిగణనలోకి తీసుకోవాలని డిఇవోను ఆదేశించారు. దోమలపై దండయాత్ర, పరిసరాల పరిశుభ్రత కోసం తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ప్రచురించిన పుస్తకాన్ని వారం రోజుల్లోగా విద్యార్ధులకు అందజేయాలని, దీని ఆధారంగానే పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు, జెసి-2 షరీఫ్, డిఇవో మధుసూధనరావు తదితరులు పాల్గొన్నారు.