పశ్చిమగోదావరి

వారంలో నేత కార్మికుల ఖాతాలకు రుణమాఫీ సొమ్ము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 27: రాష్ట్రంలో చేనేత కార్మికులకు రుణమాఫీ సొమ్మును వారం రోజుల్లో వారి ఖాతాలకు జమచేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, చేనేత, జౌళి, బిసి సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ఈమొత్తం సుమారు రూ.110 కోట్లు ఉంటుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో రూ. 65లక్షలతో నిర్మించనున్న చేనేత బజారుకు మంగళవారం మంత్రి శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతులకు రూ.24 వేల కోట్ల రుణమాఫీ చేసిందని, అదేవిధంగా చేనేత రుణమాఫీని కూడా అమలుచేస్తామన్నారు. చేనేత కార్మికులకు వడ్డీతోసహా రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. 2014నుండి వడ్డీ చెల్లించడం చేనేత కార్మికులకు భారమని తలచి, ప్రభుత్వం వడ్డీని కూడా మాఫీ చేసిందన్నారు. చేనేత కార్మికులు ఉత్పత్తి చేసే వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చేనేత బజార్లు ఏర్పాటుచేస్తున్నామన్నారు. చేనేత కార్మికులకు చేయూతను అందించాలనే ఉద్దేశ్యంతో రూ.400 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 1.3 కోట్ల మంది కార్డుదారులకు ధోవతి, చీర అందించాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. . 2014 వరకు పేరుకుపోయిన రూ.40 కోట్ల చేనేత నిల్వలకు 20 శాతం రిబేటు కల్పించి, క్లియర్ చేశామన్నారు. ముడి నూలుపై 20 శాతం సబ్సిడీ కల్పించి, 10శాతం చేనేత సొసైటీలకు, మరో 10 శాతం కార్మికుల ఖాతాలకు అందిస్తామన్నారు. రాష్ట్రంలో 35 చేనేత క్లస్టర్స్ కేంద్రాలు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిందని, మరో వంద కావాలని రాష్ట్రప్రభుత్వం విజ్ఞప్తి చేసిందన్నారు. చేనేత కార్మికులకు ఇళ్లు మంజూరు సమయంలో ఇంటితోపాటు వర్క్‌షెడ్ కూడా నిర్మించుకోవడానికి యూనిట్ విలువ రూ.లక్ష పెంచామన్నారు. ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, పీతల సుజాత, శాసనమండలి విప్ అంగర రామ్మోహనరావు, ఏలూరు ఎంపి మాగంటి బాబు, ఆప్కో డైరెక్టరు దొంతంశెట్టి సత్యనారాయణ, కలెక్టర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.