పశ్చిమగోదావరి

జాతీయ రహదారిపై కారు దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉంగుటూరు, సెప్టెంబర్ 27: జాతీయ రహదారిపై బాదంపూడి, ఉంగుటూరు గ్రామాల మధ్య నెల్లూరు వైపు వెళుతున్న కారు పూర్తిగా దగ్థమైన సంఘటన జాతీయ రహదారిపై వెళుతున్న వాహనదారులను భయభ్రాంతులకు గురిచేసింది. మంగళవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో అనపర్తి నుండి నెల్లూరు వెళుతున్న స్కార్ప్యో బాదంపూడి దాటి నాచుగుంట వంతెనకు చేరుతున్న సమయంలో ఇంజన్ నుండి పొగలు ఒక్కసారిగా రావడంతో ఆ వాహనాన్ని ఆపేశారు. ఆ వాహనంలో ప్రయాణిస్తున్న తేతలి విష్ణువర్థన్‌రెడ్డి, టి సత్యనారాయణరెడ్డి, మరో ముగ్గురు కుటుంబ సభ్యులు కారు దిగి దూరంగా పరిగెత్తారు. ఇంతలోనే ఇంజన్ నుండి మంటలు ఎగసిపడి స్కార్ప్యో కారు మొత్తం దగ్థమైంది. నెల్లూరు బంధువుల ఇంటికి ఓ శుభకార్యక్రమం నిమిత్తం విష్ణువర్ధన్‌రెడ్డి కుటుంబ సభ్యులు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తాడేపల్లిగూడెం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది.