పశ్చిమగోదావరి

ఎస్సీ వర్గీకరణకు కేంద్రం అనుకూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 27: ఎస్సీ వర్గీకరణకు కేంద్రం అనుకూలంగా ఉందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఎమ్మార్పీఎస్ జిల్లా సన్నాహక సభ స్థానిక గమిని ఫంక్షన్ హాలు వద్ద మంగళవారం నిర్వహించారు. ముందుగా ఆర్టీసీ బస్టాండు నుంచి గమిని ఫంక్షన్ హాలు వరకూ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ ఐలాండ్ సెంటరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గమిని ఫంక్షన్ ప్లాజా వద్ద జరిగిన సమావేశానికి ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చెట్టెరాజు మాదిగ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ త్వరలో చట్టబద్ధమైన ఎస్సీ వర్గీకరణ సాధిస్తామన్నారు. శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు కేంద్రం సానుకూలంగా ఉందన్నారు. దేశంలో అన్ని పార్టీల మద్దతు కూడగడతామన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా పర్యటిస్తామన్నారు. 23 సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఎస్సీ వర్గీకరణ ఉద్యమం కీలక దశలో ఉందన్నారు. మాదిగలు ఐక్యంగా ఉద్యమంలో పాల్గొనాలన్నారు. బిజెపి తరఫున వెంకయ్యనాయుడు, ఇతర పక్షాలు వర్గీకరణకు మద్దతు తెలిపాయన్నారు. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ఉద్యమం కులపరమైన ఉద్యమం కాదన్నారు. పీడిత వర్గాల ఉద్యమం అన్నారు. దీనికి బీజేపీ మద్దతు ఉంటుందన్నారు. సభలో మాజీ జడ్పీటీసీ తెనే్నటి సంజయ్‌ఖాన్, ఎమ్మార్పీఎస్ యూత్ నేత చిర్రా బాలాజీ, ఎమ్మార్పీఎస్ నాయకులు తానేటి ఆనందరావు, యర్రా నాగమల్లేశ్వరరావు, బొల్లిపో రత్నాజీ, పలివెల చంటి, చౌటుపల్లి విజయ తదితరులు పాల్గొన్నారు.