పశ్చిమగోదావరి

ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామవరపుకోట, సెప్టెంబర్ 27 : ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శ్రద్ధ చూపుతున్నారని, అందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని రాష్ట్ర గనులు, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత చెప్పారు. కామవరపుకోట మండలం తడికలపూడిలో దోమలపై దండయాత్ర - పరిసరాల పరిశుభ్రతపై ఏర్పాటుచేసిన అవగాహనా ర్యాలీలో మంత్రి పీతల సుజాత పాల్గొన్నారు. ఈ అవగాహనా ర్యాలీలో దోమలు లేని ఇల్లు - ఆనందాల హరివిల్లు, పరిసరాల పరిశుభ్రత - మన ఆరోగ్యానికి భద్రత, డెంగీపై యుద్ధం మనందరి కర్తవ్యమనే ప్లకార్డులతో విద్యార్ధులు భారీ సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూదోమలపై దండయాత్ర కార్యక్రమం నిరంతరం జరిగే ప్రక్రియని వర్షాకాలం కారణంగా దోమలు ఎక్కువగా వృద్ధి చెందే అవకాశం ఉంటుందని అందువలన ప్రతీ ఒక్కరూ వారి ఇంటితోపాటు వారి ఇంటి ప్రక్కన ఖాళీ స్థలాలుంటే చెత్తపేరుకుపోకుండా మురుగునీరు నిల్వ ఉండకుండా ఎవరికి వారు పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు పిచ్చిమొక్కలను తొలగించాలని అన్నారు. ప్రతీ ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని తాగడంతోపాటు వేడి పదార్ధాలను భుజించాలన్నారు. స్కూలు పిల్లలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. పదవ తరగతి విద్యార్ధులు కుమార రాజు, సాయి, 9వ తరగతి చదువుతున్న శోభ, 7వ తరగతి చదువుతున్న సుమశ్రీలు పరిశుభ్రతపై మాట్లాడిన తీరు మంల్రితోపాటు అక్కడకు విచ్చేసిన ప్రజలను ఎంతో ఆకట్టుకుంది. అనంతరం దోమలు నివారించేందుకు సమీప డ్రైన్లలో స్కూలు విద్యార్ధులతోపాటు దోమల మందును పీతల సుజాత స్ప్రేయింగ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ దివ్యభారతి రమేష్, ఎంపిపి మద్దిపోటి సుబ్బలక్ష్మి, పార్టీ నాయకులు కోనూరు సుబ్బారావు పాల్గొన్నారు.