పశ్చిమగోదావరి

‘నరకానికి దారి’లో 1870 గోతులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, సెప్టెంబర్ 27: తల్లాడ - దేవరపల్లి రాష్ట్ర రహదారిలో జంగారెడ్డిగూడెం నుండి జీలుగుమిల్లి వరకు చిన్న పెద్ద కలిపి 1,870 గోతులు పడ్డాయి. ఏలూరు, జంగారెడ్డిగూడెంల నుండి కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు విధి నిర్వహణ కోసం నిత్యం వెళ్ళే ఉద్యోగుల్లో ఒకాయన ఈ గోతులను లెక్కపెట్టారు. గోతుల వివరాలు వెల్లడించారు. చిన్న చిన్న గోతుల్లో మోటార్ సైకిళ్ళు పడిపోతుంటే, పెద్ద గోతుల్లో బస్సులు, లారీల ఇరుసులు విరిగిపోయి ఆగిపోతున్నాయని నిత్యం ప్రయాణించే వారు వాపోతున్నారు. ‘నరకానికి దారి’ శీర్షికన ఆంధ్రభూమి ప్రచురించిన కథనంపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మండవ లక్ష్మణరావు స్పందిస్తూ రాష్ట్ర మంత్రి పీతల సుజాత ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించి, రహదారి మరమ్మతులకు కృషి చేస్తామని చెప్పారు. ఈ రహదారి దుస్థితి పట్ల అనేకసార్లు తాము రోడ్లు భవనాల శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినట్టు చెప్పారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ అట్లూరి రామ్మోహనరావు, పట్టణ టిడిపి ప్రధాన కార్యదర్శి మద్దిపాటి నాగేశ్వరరావు ఈ రహదారి దుస్థితి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళినట్టు చెప్పారు. ఈ రహదారిలో వాహన రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని లారీ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఏలూరు ఎంపి మాగంటి బాబు దృష్టికి తీసుకువెళ్ళి మరమ్మతులకు కృషి చేస్తామని చెప్పారు.