పశ్చిమగోదావరి

రుణమాఫీ అందని ద్రాక్షేనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేలేరుపాడు, ఏప్రిల్ 1 : ఆంధ్రప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ అందని ద్రాక్షేనా అని విలీన మండలాలు, ముంపు మండలాలకు చెందిన రైతాంగం దీనావేదన వ్యక్తం చేస్తోంది. రుణమాఫీ ప్రక్రియ ఆరంభం మొదలు నేటి వరకు మంత్రులు ప్రకటించిన ప్రతీసారి ఎంతో ఆశగా బ్యాంకుల చుట్టూ తిరిగి నిరాశపాలవడమే తమ వంతవుతుందని, ఒక్క పైసా రుణమాఫీ కూడా రాకపోవడం విచారకరమన్నారు. తాము చేసుకున్న పాపమేమిటో తెలియదని, సమిష్టి రాష్ట్రంలోని అశ్వారావుపేట, వినాయకపురం, భద్రాచలం బ్యాంకుల్లో రుణాలు పొంది వ్యవసాయం చేసుకోవడం ఆనవాయితీగా వస్తోందని, అందుకు కారణం సైతం ఈ మండలాల్లో ఎపి జివిజి వికాస బ్యాంకు ఒక్కటే ఉండటం, అందులో బంగారం రుణాలు పొందే అవకాశం లేకపోవడంతో ఎన్నో సంవత్సరాలుగా తామంతా అశ్వారావుపేటలోని కమర్షియల్ బ్యాంకుల్లో రుణాలు పొందడం జరుగుతోందని, ఇటీవల ఖమ్మంజిల్లా పరిధిలోని ఈ మండలాలు ఆంధ్రాలో విలీనం కావడం ఇటు తెలంగాణా ప్రభుత్వం ఆంధ్రాలో కలిసారనే నెపంతో రుణమాఫీ వర్తింపచేయలేదని, ఆంధ్రా ప్రభుత్వం ఆంధ్రా పరిధిలోని బ్యాంకులకే రుణమాఫీ వర్తిస్తుందని, ఈ మండలాలకు చెందిన రైతాంగం రుణాలు పొందిన తెలంగాణా బ్యాంకుల్లో వర్తించబడదని పట్టించుకునే యత్నం చేయడం జరిగిందని, ఈ విషయాన్ని తాము పాలకుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లగా వారంతా మీరు కోరిన కోరిక సబబుగానే వుందని, అందుకు సంబంధించిన జాబితాను సమర్పిస్తే తప్పక రుణమాఫీ వర్తింపచేస్తామని హామీ ఇవ్వడంతో ఎంతో సంతృప్తి చెందడం తమ వంతైందని, నాటి నుంచి నేటి వరకు ఆశతో ఎదురు చూడటమే తప్ప జాబితాలో తమ పేర్లు కానరాలేదన్నారు. ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో సైతం వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు ముంపు మండలాల రైతుల రుణమాఫీకి ప్రత్యేక నిధులు కేటాయించినట్లు బాహాటంగా ప్రకటించారని, అవి సైతం నేటికీ ఈ మండలాల రైతులకు చేరకపోవడంలో ఆంతర్యమేమిటో అర్ధంకాని పరిస్థితి నెలకొందని ముంపు మండలాల రైతాంగం తలపట్టుకుంటోంది. ఇప్పటికైనా పాలకులు వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రుణమాఫీని తమకు వర్తింపచేయాలని వేడుకుంటున్నారు.

యూనిట్‌కు రూ.175 మించితే చర్యలు
కొవ్వూరు ఎమ్మెల్యే జవహర్
కొవ్వూరు, ఏప్రిల్ 1: యూనిట్ ఇసుక రూ.175 కంటె ఎక్కువ వసూలు చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కెఎస్ జవహర్ స్పష్టం చేశారు. శుక్రవారం కొవ్వూరులో తన కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అన్ని ఇసుక ర్యాంపుల ద్వారా యూనిట్ ఇసుక రూ.175కే సరఫరా చేయనున్నట్టు చెప్పారు. ఇసుకకు సంబంధించి సమస్యలు ఎదురైతే సంబంధిత అధికారులను తక్షణం సంప్రదించాలన్నారు. ఈ నెల 9న పశివేదల గ్రామంలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించడానికి సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి రావెల కిషోర్ కొవ్వూరు వస్తున్నట్టు తెలిపారు. అంతకుముందు కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 116 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కులను అందజేశారు.

ఇక ఇసుక ఇబ్బందులు తీరినట్టే:ఎమ్మెల్యే జవహర్
తాళ్లపూడి, ఏప్రిల్ 1: ప్రజలందరికీ ఇక ఇసుక ఇబ్బందులు లేనట్లేనని, కేవలం లోడింగ్ ఛార్జీలు యూనిట్‌కు రూ.175లు చెల్లిస్తే ప్రతివారు తమ వాహనాలపై ఇసుకను తీసుకువెళ్లవచ్చునని కొవ్వూరు ఎమ్మెల్యే జవహర్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం మండలంలోని బల్లిపాడు ఇసుక రీచ్‌ను సందర్శించి ఆయన కొబ్బరికాయను కొట్టారు. అనువుగా ఉన్న ఎక్కడి రీచ్ నుండైనా ఇసుకను తీసుకువెళ్లవచ్చునన్నారు. ప్రైవేటు వ్యక్తులెవరైనా రీచ్‌ల్లో దందా నిర్వహిస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఉచిత ఇసుక రవాణా చేసే వాహనాలకు చెల్లించే రుసుము అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. లారీ యజమానులతో సమావేశాన్ని ఏర్పాటుచేసి సక్రమమైన రీతిలో రవాణా చేయించాలని ఎస్సై జె సతీష్‌ను ఆదేశించారు. ఆయన వెంట జడ్పీటీసీ సభ్యురాలు కె మంగాభవాని, ఎంపిపి అనంతలక్ష్మి, సర్పంచ్ పాపారత్నం తదితరులు పాల్గొన్నారు.