పశ్చిమగోదావరి

నిర్వాసితుల సమస్యలపై రాజకీయాలకు అతీతంగా ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, అక్టోబర్ 25: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల సాధనకు రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేస్తామని ప్రాజెక్టు నిర్వాసితుల సంక్షేమ సమితి రాష్ట్ర కన్వీనర్ సుబ్బరాయశాస్ర్తీ అన్నారు. ఆయన మానవహక్కుల సంఘం సభ్యుడు యుగంధర్‌రెడ్డితో కలిసి పైడిపాక పునరావాస గ్రామంలో మంగళవారం నిర్వాసితులతో సమావేశమయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థగా నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేందుకు సమితి ఏర్పడినట్టు చెప్పారు. పునరావాస గ్రామాల్లో గత రెండు నెలలుగా సర్వే నిర్వహించి వారి సమస్యలు తెలుసుకున్నామన్నారు. నిర్వాసితుల సమస్యలు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళేందుకు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు వినతిపత్రం ఇచ్చినట్టు చెప్పారు. అలాగే ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు చూస్తున్న నిర్వాసితుల సమస్యలు తెలియచేసేందుకు ముఖ్యమంత్రిని కలుస్తామని సుబ్బరాయశాస్ర్తీ తెలిపారు. వనవాసీ కల్యాణ ఆశ్రమం జాతీయ అధ్యక్షుడు గిరీష్ కుబేర్ వచ్చే నెల 23న పర్యటించి నిర్వాసితుల సమస్యలను తెలుసుకుంటారన్నారు. నిర్వాసితుల సమస్యలను కుంచే దొరబాబు సుబ్బరాయశాస్ర్తీకి వివరించారు.