పశ్చిమగోదావరి

సరిహద్దుల్లో ఇసుకాసురులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుకునూరు, అక్టోబర్ 25: మండల పరిధిలోని ఆంధ్రా సరిహద్దు గ్రామమైన బూరుగువాయి ఇసుక రేవు వద్ద ఇసుక అక్రమ రవాణా భారీగా జరుగుతుండటంతో ఒక్కసారిగా మంగళవారం ఎస్‌ఐ సాదిక్ ఆధ్వర్యంలో మెరుపుదాడి చేసి పది లారీలు, జెసిబి, ఆ ప్రాంతంలోనే వున్న ఒక కారును పట్టుకున్నారు. గత కొంతకాలంగా అక్కడ కొందరు వ్యక్తులు వందలాది లారీలు ఇసుక రవాణా చేస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు సరిహద్దు గ్రామంపై నిఘా పెట్టారు.
ఇదిలావుండగా సరిహద్దు ప్రాంతంలో ఇసుక అక్రమ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మంగళవారం తెల్లవారుజామున మాటు వేసిన పోలీసులు జెసిబితో అప్పటికే మూడు లారీలు నింపిన లారీలు, ఖాళీగా వున్న ఏడు లారీలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో కారు ఒకటి మాత్రమే ఖాళీగా వుండి అక్కడ వ్యక్తులు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. దీనితో పోలీసులు వెంటనే ఆ వాహనాలను స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఎస్ ఐ సాధిక్ తెలిపిన వివరాల ప్రకారం బూరుగువాయి ఇసుక రేవు నుంచి అర్ధరాత్రి సమయంలో తరలించేందుకు సిద్దంగా వుంచిన లారీలను, ఒక జెసిబిని, అక్కడ వదిలేసి వున్న కారును, లారీ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఇసుక ఇక్కడ నుంచి తెలంగాణ ప్రాంతానికి తరలిస్తున్నట్లు తెలిపారు. దీనిపై విచారణ కొనసాగుతోందని, పూర్తి విచారణ అనంతరం అసలు విషయాలు బయటకు వస్తాయని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇది గత కొంతకాలంగా కొనసాగుతున్నట్లు సమాచారం.