పశ్చిమగోదావరి

పోలవరం మట్టి డంపింగ్ భూములు పరిశీలించిన జెసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, అక్టోబర్ 25: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తీస్తున్న మట్టిని డంపింగ్ చేసేందుకు భూములను జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు మంగళవారం పరిశీలించారు. సుజల అతిథిగృహం వద్దకు జెసి చేరుకోగా ప్రాజెక్టు ఇంజనీర్లు డంపింగ్ భూమిని చూపించేందుకు తీసుకెళ్లారు. ప్రాజెక్టు కుడికాల్వ ప్రారంభం కుడివైపున ప్రభుత్వానికి చెందిన యాభై ఎకరాలున్నాయని, ఆ భూములను ఆయన పరిశీలించినట్టు తెలిసింది. ఈ విషయం విలేకర్ల వద్ద గోప్యంగా ఉంచి వివరాలు చెప్పకుండా ప్రాజెక్టు ప్రాంతానికి వెడుతున్నట్టు జెసి చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో తీస్తున్న మట్టిని డంపింగ్ చేయడానికి సుమారు 400 ఎకరాలు అవసరమవుతాయి. పోలవరంలోని మూల్లంకకు చెందిన 204 ఎకరాల భూమిని సేకరించేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నించగా ప్రభుత్వం ఇచ్చే ఎకరాకు 16 లక్షల నష్టపరిహారంపై అభ్యంతరం తెలిపిన రైతులు కోర్టుకు వెళ్లి స్టేటస్‌కో ఆర్డరు తెచ్చుకున్నారు. ప్రాజెక్టు పనులు వేగవంతం కావాలంటే డంపింగ్ యార్డు అత్యవసరం. పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాభై ఎకరాల్లో డంపింగ్ చేయాలని అధికారుల ఆలోచన. ఈ లోగా డంపింగ్ యార్డు కోసం భూములు సేకరించవచ్చనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. దాంతో ఆ భూములను పరిశీలించేందుకు జెసి కోటేశ్వరరావు ప్రాజెక్టు ఇఇ పుల్లారావు, ఆర్డీవో ఎస్ లవన్న, ప్రాజెక్టు కాంట్రాక్టు ఏజన్సీ ప్రతినిధులు వెళ్లి ఆ భూములను పరిశీలించారు.