పశ్చిమగోదావరి

కార్పొరేట్‌కు దీటుగా గురుకుల పాఠశాలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, అక్టోబర్ 25: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. రూరల్ మండలం ఆరుగొలను సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల 3వ జోనల్ క్రీడా మహోత్సవాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల 13 పాఠశాలల, కళాశాలల 600 మంది క్రీడాకారులు ఈ క్రీడాపోటీల్లో పాల్గొని ప్రతిభను చాటుతారన్నారు. క్రీడల్లో విద్యార్థుల ప్రతిభను నిరూపించుకుని ప్రపంచ స్థాయిలో క్రీడాకారులుగా గుర్తింపు పొందాలన్నారు. ఆరుగొలను గురుకుల పాఠశాల అభివృద్ధికి రూ. 30 కోట్లు నిధులు కేటాయిస్తామన్నారు. సుమారు 1500 మంది విద్యార్థినీ విద్యార్థులకు వసతి చేకూరేలా ఈ నూతన భవన నిర్మాణం ఉంటుందన్నారు. పాత భవనాల మరమ్మతుల నిమిత్తం రూ. 35 కోట్లు కేటాయించామన్నారు. క్రీడాకారిణి సింధును స్ఫూర్తిగా తీసుకుని ప్రతి విద్యార్థి దేశం గర్వించేలా మహోన్నత స్థానం పొందాలన్నారు. కాపు కార్పొరేషన్ డైరెక్టర్ యర్రా నవీన్ మాట్లాడుతూ క్రీడల పట్ల విద్యార్థులు ఆసక్తిని పెంపొందించుకోవాలన్నారు. ఆరుగొలను సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ పి రాంప్రసాద్ మాట్లాడుతూ ఎవరెస్టు శిఖరం అధిరోహించేందుకు వీలుగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. అనంతరం మంత్రి కబడ్డీ కోర్టును ప్రారంభించారు. కార్యక్రమంలో గురుకుల కళాశాల
వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పివిఎస్ కె సోమయాజులు, కైండ్‌నెస్ సొసైటీ అధ్యక్షుడు గట్టిం మాణిక్యాలరావు, బిజెపి నాయకులు యెగ్గిన నాగబాబు, తహసీల్దార్ పాశం నాగమణి, ఎంపిడిఒ వై దోశిరెడ్డి, ఎంపిపి గన్నమనేని దొరబాబు, సర్పంచ్ వెంకట్రావు, ఎంపిటిసి సహదేవుడు, కొత్తూరు సర్పంచ్ వెంకటలక్ష్మి, సొసైటీ అధ్యక్షుడు నూకల బుల్లియ్య, గురుకుల సంస్థ ఒఎస్‌టి పి రాజారావు తదితరులు పాల్గొన్నారు.