పశ్చిమగోదావరి

అన్ని చౌక డిపోల వద్ద స్వైపింగ్ మిషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసాపురం, నవంబర్ 29: నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు వీలుగా డిసెంబర్ ఒకటి నుంచి డివిజన్‌లోని అన్ని చౌకడిపోల వద్ద స్వైపింగ్ మిషన్లు అందుబాటులో ఉంచుతున్నట్టు నరసాపురం సబ్ కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ తెలిపారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ డివిజన్‌లోని 657 చౌకడిపోల ద్వారా ప్రజలు నిత్యావసర వస్తువులు పొందుతున్నారన్నారు. డిసెంబర్ నెల నుంచి రేషన్ కార్డుదారులు తమ రూపే, ఎటిఎం కార్డులు వినియోగించుకొని రేషన్ పొందాలన్నారు. అలాగే డిసెంబర్ రేషన్‌తోపాటు పామాయిల్, కందిపప్పు, ఉప్పు మొదలగు నిత్యావసర వస్తువులు తెలుపు రంగు రేషన్‌కార్డుదారులకు అందిస్తామన్నారు. అదేవిధంగా డివిజన్‌లో నగదురహిత లావాదేవీలు నిర్వహించేలా వ్యాపారులు, విద్యా సంస్థలు, ఇతర సేవా సంస్థలు స్వైపింగ్ మిషన్లు సమకూర్చుకోవాలన్నారు. అలాగే ప్రతి గ్రామంలో నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు వివరించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నట్టు సబ్ కలెక్టర్ తెలిపారు. ఇందుకుగాను బ్యాంకు హెల్ప్ టీములు, రెవెన్యూ అధికారులు, విద్యార్థులు, డ్వాక్రా మహిళలతో బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందాలు బ్యాంకు ఖాతాలు లేని కుటుంబాలను గుర్తించి వారికి బ్యాంకు ఖాతా తెరిపిస్తారన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ నగదురహిత లావాదేవీలను అలవరుచుకొని ప్రభుత్వానికి సహకరించాలని సబ్ కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ కోరారు.

రెండో విడత డ్వాక్రా రుణమాఫీ రూ.181.54 కోట్లు
జంగారెడ్డిగూడెం, నవంబర్ 29: జిల్లాలో రెండో విడత రూ.181.54 కోట్లు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తున్నట్టు రాష్ట్ర మహిళా సాధికారిత, స్ర్తి, శిశు సంక్షేమ, భూగర్భ గనుల శాఖల మంత్రి పీతల సుజాత వెల్లడించారు. మండలంలోని అక్కంపేటలో మంగళవారం డ్వాక్రా సంఘాల మహిళలకు రుణమాఫీ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిఆర్‌డిఎ పిడి కె శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్టులో ఉన్నప్పటికీ ఎన్నికల వాగ్దానాలు సిఎం చంద్రబాబు ఏవీ విస్మరించకుండా అమలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. డ్వాక్రా సంఘానికి లక్ష రూపాయలు, లేక సంఘంలోని ప్రతి మహిళకు రూ.10వేలు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు తొలి విడత రూ.3వేలు మహిళల పొదుపుఖాతాలకు జమ అయిపోయిందన్నారు. రెండవ వాయిదా రూ.3వేలు మహిళల చేతికే అందాలన్న లక్ష్యంతో వారి గ్రూపు ఖాతాలలో జమ చేసినట్టు తెలిపారు. జంగారెడ్డిగూడెం రూరల్ మండలంలో రూ.3.9 కోట్లు రెండో విడత డ్వాక్రా రుణమాఫీ చేసినట్టు మంత్రి వివరించారు. మగవారితో సమానంగా అన్ని రంగాలలోను మహిళలను అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని, ఏ ప్రభుత్వ కార్యక్రమం తీసుకున్నా డ్వాక్రా మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే డ్వాక్రా మహిళలు వేల కోట్ల రూపాయల బ్యాంకు కార్యకలాపాలు చేస్తున్నారని, వీరికి క్రెడిట్, డెబిట్ కార్డులు కూడా ఉన్నాయన్నారు. నేడు నగదు రహిత కార్యకలాపాల కోసం రుపే కార్డు కూడా అందజేస్తున్నట్టు చెప్పారు. మహిళల ఆరోగ్యం పట్ల కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, 35 ఏళ్ల వయస్సు దాటిన మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు చేయిస్తూ, బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్‌లకు చికిత్స చేయించేందుకు చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎన్ని కష్టాలు ఉన్నా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా చంద్రబాబు ముందుకు సాగుతున్నారని, ఏటా 44 లక్షల మందికి రూ.6వేల కోట్లు పింఛన్ల రూపంలో పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. 50వేల లోపు రుణం ఉన్న రైతులకు రుణమాఫీ ఒకే విడతలో చేసారని, మిగిలిన వారికి విడతల వారీగా రుణమాఫీ చేస్తున్నారని చెప్పారు. ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద ప్రతి లబ్ధిదారునికి రూ.1.5 లక్షలతో గృహనిర్మాణం, మరో రూ.15వేలతో వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం చేయనున్నట్టు మంత్రి వివరించారు. దీపం పథకం కింద వచ్చే జూన్ 2 నాటికి రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి వంట గ్యాసు కనెక్షన్ ఇవ్వనున్నట్టు మంత్రి సుజాత వెల్లడించారు.
శాసనమండలిలో ప్రభుత్వ విప్ అంగర రామ్మోహనరావు మాట్లాడుతూ ఎన్ని కష్టాలు ఉన్నా అభివృద్ధి, సంక్షేమం చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ప్రతిపక్ష నేత జగన్ బురదజల్లాలని చూస్తున్నాడని విమర్శించారు. జగన్ పెద్ద నోట్ల రద్దుపై 15 రోజుల వరకు నోరు మెదపకపోవడానికి కారణం అతని వద్దే పెద్దనోట్లు అధికంగా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై చర్చ వచ్చిన సందర్భంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాష్ట్రానికి చంద్రబాబు ఉన్నాడని చెప్పి, ఆయన పనితీరును ప్రశంసించారని గుర్తు చేశారు. అనంతరం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో గర్భవతులకు మంత్రి సుజాత చేతుల మీదుగా సీమంతాలు చేశారు. ఈ సభలో టిడిపి సీనియర్ నేత మండవ లక్ష్మణరావు, ఎంపిపి కొడవటి సత్తిరాజు, జడ్పీటీసీ శీలం రామచంద్రరావు, టిడిపి నేతలు పెనుమర్తి రామ్‌కుమార్, షేక్ ముస్త్ఫా, దల్లి కృష్ణారెడ్డి, ముళ్లపూడి శ్రీనివాసరావు, నంబూరి రామచంద్రరాజు, ఎలక్ట్రికల్ డిఇ సాల్మన్‌రాజు, వెలుగు ఎపిఎం నంబూరి ఝాన్సీ, తహసీల్దార్ జివివి సత్యనారాయణ, ఎంపిడిఒ పి శ్రీదేవి, సిఐ జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పట్టిసీమ ఒక గొప్ప ప్రాజెక్టు
ఏలూరు, నవంబర్ 29: పట్టిసీమ ప్రాజెక్టు వలన అన్ని ప్రయోజనాలు ఉన్నాయా? పట్టిసీమ వల్ల రాయలసీమకు నీరు ఎలా అందుతుందని... నిజంగా గోదావరి జలాలు అంతా సద్వినియోగం అవుతున్నాయా? నిజంగా రాయలసీమ నాలుగు జిల్లాలకు సేద్యపునీరు, ప్రజలకు తాగునీరు అందించగలిగితే ఇది ఒక గొప్ప ప్రాజెక్టు అని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల కమిషన్ ఛైర్మన్ కె ఎల్ మంజునాథ్ అన్నారు. రెండు రోజులుపాటు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటన కోసం మంగళవారం రాత్రి ఏలూరు జిల్లా పరిషత్తు అతిధిగృహానికి చేరుకున్న మంజునాధ్‌కు జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్, జిల్లా ఎస్‌పి భాస్కర్ భూషణ్‌లు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా పశ్చిమగోదావరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ వివరించగా మంజునాధ్ ఎంతో ఆసక్తిగా విన్నారు. సోలార్ విద్యుత్తు ఉత్పత్తి మొదలుకుని పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల ప్రగతి తీరును కలెక్టర్ వివరించారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా జిల్లా ఇబ్రహీం పట్నం వద్ద కృష్ణానదితో అనుసంధానం చేయడం జరిగిందని, కృష్ణా ఆయకట్టు పరిధిలో గోదావరి జలాలను వినియోగించడం వలన శ్రీశైలం జలాశయం నుండి కృష్ణా డెల్టాకు వచ్చే నీటిని రాయలసీమలోని నాలుగు జిల్లాలకు తరలించడం జరుగుతుందని దాని వలన రాయలసీమ ఒక పంట ఖచ్ఛితంగా రైతులు పండించుకోగలుగుతారని తాగునీటికి ఇబ్బంది లేకుండా చేయగలుగుతారని వివరించారు. పట్టిసీమ ద్వారా నీటిని కృష్ణాజిల్లాకు తరలించడం వలన పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం కుడికాల్వ పరిధిలోని మెట్ట ప్రాంతాలు కూడా ఎంతో అభివృద్ధి సాధించగలుగుతున్నాయని, ముఖ్యంగా భూగర్భజలాల నీటి మట్టం పెంపొందించడానికి పట్టిసీమ జలాలు ఎంతో దోహదపడుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్‌పి భాస్కర్ భూషణ్, బిసి సంక్షేమ శాఖ రాష్ట్ర అధికారి కృష్ణమోహన్, జెసి-2 ఎంహెచ్ సరీఫ్, బిసి సంక్షేమాధికారి లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.
మహిళల ఆర్థికాభివృద్దికి ముఖ్యమంత్రి కృషి
నరసాపురం, నవంబర్ 29: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషిచేస్తున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అన్నారు. మంగళవారం మండలంలోని దర్భరేవు, రాజులంక గ్రామాల్లో నిర్వహించిన జనచైతన్య యాత్రలో ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావులతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో జడ్పీ చైర్మన్ బాపిరాజు మాట్లాడుతూ మహిళలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలను ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారన్నారు. దీనిలో భాగంగా డ్వాక్రా రుణాలు మాఫీ చేశారన్నారు. నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మాట్లాడుతూ మరో రెండేళ్లలో ఎన్నికలు లేనప్పటికీ ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల మధ్యనే ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. దీనిలో భాగంగా జనచైతన్య యాత్రను రూపొందించారన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని సత్వరమే పరిష్కరించేందుకు జనచైతన్య యాత్రలు ఉపకరిస్తున్నాయని ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు పేర్కొన్నారు. అనంతరం రూ.54.58 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిపి వాతాడి కనకరాజు, జడ్పీటీసీ బాలం ప్రతాప్, ఎఎంసి చైర్మన్ రాయుడు శ్రీరాములు, పశ్చిమ డెల్టా ప్రాజెక్టు ఛైర్మన్ పొత్తూరి రామరాజు, ఎఎంసి ఛైర్మన్ రాయుడు శ్రీరాములు, సర్పంచ్‌లు తిరుమాని మార్రాజు, తంగెళ్ల నాగేశ్వరరావు, ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ బండారు పటేల్‌రాజా నాయుడు తదితరులు పాల్గొన్నారు.

తాగునీటి పథకాలు - రహదార్ల నిర్మాణాలు
-రూ.15 కోట్ల ప్రతిపాదనలు సమర్పించిన మంత్రి పైడికొండల
-మంజూరునకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి తోమర్ హామీ
ఆంధ్రభూమి బ్యూరో
తాడేపల్లిగూడెం, నవంబర్ 29: నియోజకవర్గంలో ప్రతిపాదించిన గ్రామీణ తాగునీటి పథకాలు, రహదారుల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలకు సత్వరం నిధులు మంజూరు చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ హామీ ఇచ్చారని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సుమారు రూ.15కోట్లతో ప్రతిపాదించిన ప్రతిపాదనలను మంత్రి మాణిక్యాలరావు కేంద్ర మంత్రి తోమర్‌కు ఢిల్లీలో మంగళవారం అందజేశారు. సత్వరం ఆమోదించి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మంత్రి తోమర్ సాధ్యమైనంత త్వరగా ఆర్‌డబ్ల్యూఎస్, సడక్ యోజన రహదారులకు మంజూరు ఇచ్చి నిధులు అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
గోదావరి జలాల పైపులైను ప్రాజెక్టుకు వెంకయ్య సుముఖం
పట్టణంలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రతిపాదించిన గోదావరి జలాలు పైపులైను ప్రాజెక్టును సత్వరం మంజూరుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడును ఢిల్లీలో మంగళవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు కోరారు. దీనిపై సానుకూలంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి గోదావరి జలాల పైపులైనుకు సంబంధించిన ఫైలు రాగానే మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం వౌలిక వసతుల అభివృద్ధికి అన్నివిధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం
పోలవరం, నవంబర్ 29: సోషల్ ఎకనామిక్ సర్వే (ఎస్‌ఇఎస్)లో పేరుండి ప్యాకేజీ రానివారికి పరిశీలించి వారికి ప్యాకేజీ ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు అన్నారు.