పశ్చిమగోదావరి

పదవీ విరమణ రోజే పింఛను పత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, డిసెంబర్ 1: పదవీ విరమణ చేసిన కార్మికునికి అదే రోజు ప్రావిడెంట్ ఫండ్ సెటిల్ చేయడంతో పాటు ఎంప్లాయిస్ పెన్షన్ స్కీం (ఇపిఎస్) కింద చెల్లించే పింఛను కూడా కార్మికుని బ్యాంకు ఖాతాకు జమచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు నరసాపురం ఎంపి, లైలా గ్రూపు సంస్థల అధినేత గోకరాజు గంగరాజు స్పందించారు. తొలిసారిగా ఆయన ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న డెల్టా పేపర్ మిల్లులో ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్‌ను తొలిసారిగా ప్రారంభించారు. పదవీ విరమణ చేసిన వీరవల్లి వెంకటేశ్వరరావుకు ప్రావిడెంట్ ఫండ్ సెటిల్‌మెంట్‌తో పాటు పింఛను మంజూరు పత్రాలను పిఎఫ్ రీజినల్ కమిషనర్ గణేష్‌కుమార్ ఆధ్వర్యంలో డిపిఎం డైరెక్టర్ గోకరాజు పాండురంగరాజు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పదవీ విరమణ చేసేవారికి మంచి పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రతి పరిశ్రమ, సంస్థలు ఈ పథకాన్ని పదవీ విరమణ చేసిన వారికి అమలు చేయాలని పిలుపునిచ్చారు.