పశ్చిమగోదావరి

డ్రాగన్ జూదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జనవరి 15: సంప్రదాయ కోడి పందాల ముసుగులో ఈ ఏడాది జిల్లాలో డ్రాగన్ జూదాలు విచ్చలవిడిగా జరిగిపోయాయి. భోగి పండుగ నుంచి ఇవి ప్రారంభమయ్యాయి. ఈ మూడు రోజుల్లో జరిగిన జూదాల్లో రూ.కోట్లు చేతులు మారాయి. జిల్లాలోని డెల్టాలో కోడి పందాల బరుల వద్ద ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటుచేసి, వచ్చిన వారికి అవగాహన కల్పించి మరీ జూదం ఆడించారు. ఇప్పటివరకు సంప్రదాయ కోడి పందాల ముసుగులో కోతాట, గుండాట మాత్రమే జరిగేవి. ఈ ఏడాది కొందరు జూదగాళ్లు దేశ, విదేశాల్లో తిరిగి ఎక్కడ ఏ జూదం ఎక్కువగా ప్రాముఖ్యత సంతరించుకుందో ఆ సంస్కృతికి ఈ సంక్రాంతి పండుగ నేపథ్యంలో వీటిని పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభించారు. దీనికి డ్రాగన్ జూదం అని కూడా పేరు పెట్టారు. చైనా, జపాన్, టిబెట్, సింగపూర్ తదితర దేశాల్లో ఎక్కువగా పందాలు జరుగుతాయి. అన్నింటి పైనా పందాలు వేస్తారు. మానవులు కొట్టుకోవడం నుంచి పశువులు, పక్షులతో, ఇతరత్రా వాటిపైన పందాలు వేయడం వారికి ఆనవాయితీ. అదే విధంగా ఆ సంప్రదాయాన్ని సంక్రాంతి కోడి పందాల ముసుగులో షూట్‌బాల్, కంట్రీ ఫ్లాగ్స్, రంగుల కాయిన్స్ ఇలా అనేక రకాల జూదాలను ఆడించారు కొందరు జూదగాళ్లు. ఈ జూదాల కోసం డ్రాగన్ దేశంలో ఏ విధంగా పందాలకు టెంట్లు వేస్తారో అదే తరహాలో జిల్లాలోని భీమవరం మండలం వెంప గ్రామంలో ఏర్పాటుచేశారు. ప్రత్యేకంగా ఒకొక్క జూదానికి సంఖ్యను కేటాయించారు. ఒకటవ సంఖ్యలో ఉన్న జూదం మరెక్కడా ఉండదు. ఆ విధంగా 50 రకాల జూదాలను ఏర్పాటుచేశారు. ఇక కోడి పందాలను వీక్షించేందుకు దేశ, విదేశాల నుంచి ఎన్‌ఆర్‌ఐలు వచ్చారు. వీరంతా 25 శాతం డబ్బుతో కోడి పందాల ఆడగా, 75 శాతం డబ్బుతో ఈ డ్రాగన్ జూదాలను ఆడటం విశేషం. కోడి పందెంలా కాకుండా తక్కువ సమయంలో జరిగే ఈ జూదంలో డబ్బు రావచ్చు..పోవచ్చు. మొత్తం మీద ఈ ఏడాది సంక్రాంతి కోడి పందాల ముసుగులో డ్రాగన్ జూదం తొలి అడుగును జిల్లాలో మోపడం విశేషం.