పశ్చిమగోదావరి

శరవేగంగా పోలవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, జనవరి 15: పోలవరం ప్రాజెక్టు 2018 నాటికి పూర్తిచేయడం ద్వారా ముఖ్యమంత్రి ప్రజల గుండెల్లో నిలిచిపోతారని అనంతపురం ఎంపి జెసి దివాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం పోలవరం వచ్చిన పట్టిసం ఎత్తిపోతల పథకాన్ని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రాజెక్టు వేగంగా పూర్తిచేసినందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. పట్టిసం ఎత్తిపోతలను రికార్డు సమయంలో పూర్తిచేసి కృష్ణా డెల్టాను కాపాడారని, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూడా పూర్తి చేస్తారన్నారు. భగవంతుని దయలో ఏవిధమైన ఆటంకాలు లేకుండా 2018 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని ఆకాంక్షిస్తున్నట్టు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కృషి కారణంగానే పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నట్టు ఆయన చెప్పారు. ఉభయగోదావరి జిల్లాల్లో సంస్కృతీ సంప్రదాయాలు బాగానే ఉన్నాయని, ఇతరులను ఎంతో అభిమానంతో ఆదరిస్తారని ఆయన తెలిపారు. ముందుగా పట్టిసం ఎత్తిపోతల పథకం వద్దకు చేరుకున్న ఆయనకు డిఇ శ్రీకాంత్ ఎత్తిపోతల అభివృద్ధిని వివరించారు. అక్కడి నుండి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న ఆయన కాంట్రాక్టు ఏజెన్సీ క్యాంపు కార్యాలయంలో ప్రాజెక్టు నమూనా ద్వారా వివరాలు తెలుసుకున్నారు. జెసి దివాకర్‌రెడ్డి ప్రాజెక్టు డిఇ బాలకృష్ణ, వెంకటేశ్వరరావులు ప్రాజెక్టు గురించి వివరించారు.
ఘనంగా శ్రీవారి కనుమ మహోత్సవం
ద్వారకాతిరుమల, జనవరి 15: శ్రీవారి కనుమ మహోత్సవం శేషాచల కొండ వెనుకనున్న దొరసానిపాడు గ్రామంలో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారు అట్టహాసంగా దొరసానిపాడు గ్రామానికి తరలివెళ్లారు. గ్రామంలోని మహిళలు స్వామివారి వాహనం వచ్చే దారి పొడవునా రంగవల్లులతో తీర్చిదిద్దారు. శ్రీవారి క్షేత్రం నుండి ఊరేగింపుగా వెళ్లిన చిన వెంకన్న దొరసానిపాడు గ్రామంలో ఊరేగి కనుమ మండపం వద్దకు వచ్చి భక్తులకు దర్శనమిచ్చారు. మండపంలో ఉభయ దేవేరులతో శ్రీవారిని ఉంచి ఆలయ అర్చకులు, పండితులు ప్రత్యేక పూజలు జరిపారు. తర్వాత నీరాజన తిరుమంజనాలను సమర్పించి ప్రసాదాలను నైవేద్యం చేశారు. వాటిని భక్తులకు ప్రసాదంగా సమర్పించారు. అనంతరం స్వామివారు గిరి ప్రదక్షిణగా శేషాచల కొండ మార్గాన్న తిరుగుతూ భక్తుల గోవింద నామ స్మరణ, మేళతాళాల మధ్య ఆలయానికి చేరుకున్నారు. ప్రతి ఏటా శ్రీవారు కనుమ పండుగ రోజు మాత్రమే క్షేత్రాన్ని విడిచి పొరుగు గ్రామానికి వెళ్లడం ఇక్కడ విశిష్టత. అందులోనూ కనుమ రోజున కాకైనా కదలదనేని ఒక నానుడి. అయితే ఏడాదిలో ఒక మారు అదీ కనుమ నాడు ఇలా చిన వెంకన్న క్షేత్రాన్ని విడిచి వెళ్లడం ఒక ప్రత్యేకతగా ఆలయ అర్చకులు చెబుతున్నారు. ఆలయ ఇవో వేండ్ర త్రినాధరావు దంపతులు కనుమ ఉత్సవంలో పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు.