పశ్చిమగోదావరి

విగ్రహాలు పెట్టడానికి వీలులేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 1: జిల్లాలో ఎక్కడా ఎవరి విగ్రహాలు పెట్టడానికి వీలులేదని కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. స్ధానిక కలెక్టరేట్‌లో సోమవారం మీకోసం కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఆయన వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పాలకోడేరు మండలం నుండి కొంతమంది కలెక్టరుకు వినతిపత్రం సమర్పిస్తూ తమ నాయకుల విగ్రహాలు ఏర్పటుచేసుకుంటామని, అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై కలెక్టరు స్పందిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎవరూ ఎక్కడా ఏ ఒక్కరి విగ్రహాలు ఏర్పాటుచేయడానికి వీలులేదని, అందువల్ల అనుమతించే అవకాశం లేదని స్పష్టంచేశారు. ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీకోసం కార్యక్రమానికి వచ్చి తన నియోజకవర్గంలోని కొన్ని సమస్యల పరిష్కారానికి ప్రజల తరఫున కలెక్టరు భాస్కర్‌కు వినతిపత్రాలు అందజేశారు. మండలంలోని కూచింపూడి, వేగివాడ గ్రామాల్లో ప్రజలు తాగునీటికోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, పెరుగుగూడెంలో నిర్మిస్తున్న ఆర్‌అండ్‌బి రోడ్డును ఒక వ్యక్తి కోర్టుకు వెళ్లడం వల్ల కొంతమేర నిలిపివేశారని, దానిపై సరైన నిర్ణయం తీసుకుని రోడ్డును పూర్తిచేయాలని ప్రభాకర్ కోరారు. పెదవేగి మండలం దగ్గర ఆర్‌ఎన్‌సి కెనాల్ నుండి రెండుచోట్ల లిఫ్ట్‌లు ఏర్పాటుచేసేందుకు భూగర్బ జలశాఖ ద్వారా నివేదిక రావాల్సి ఉందని, దాన్ని వెంటనే ఇప్పించాలని కోరారు. వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టరు ఆదేశించారు. భీమడోలు మండలం గుండుగొలను గ్రామానికి చెందిన ఎన్ కృష్ణమూర్తి గ్రామంలో ప్రజలకు కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు పంచాయతీ అధికారులు సుమారు 7.30లక్షల రూపాయలు వసూలు చేశారని, ఆ సొమ్ము ప్రభుత్వానికి జమకాకుండా దుర్వినియోగం అయిందని పేర్కొన్నారు. దీనిపై స్వయంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డిపిఓను కలెక్టరు ఆదేశించారు. చొదిమెళ్లకు చెందిన అశ్విని వినతిపత్రం సమర్పిస్తూ గ్రామంలో పంటబోదెను ఆక్రమించుకోవటం వల్ల సమీపంలోని పొలాలకు సాగునీరు అందటం లేదని, పేర్కొన్నారు. పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ ఎస్‌ఇని ఆదేశించారు.

చెరువులో రొయ్యలు మృతిపై విచారణ
నరసాపురం, మే 1: మండలంలోని చామకూరిపాలెం గ్రామంలో చెరువులో రొయ్యలు చనిపోయిన సంఘటనపై సోమవారం మత్స్యశాఖ అధికారులు విచారణ చేపట్టారు. చెరువులోని నీరు, చనిపోయిన రొయ్యల నమూనాలను సేకరించి, నిజనిర్ధారణ కోసం విజయవాడ ల్యాబ్‌కు పంపారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి మత్స్యశాఖ అధికారి ఎల్‌ఎల్‌ఎన్ రాజు విలేకరులతో మాట్లాడుతూ రైతు వేగేశ్న వేణుగోపాల కృష్ణంరాజు ఫిర్యాదు మేరకు చెరువును పరిశీలించామన్నారు. రైతు 23 ఎకరాల విస్తీర్ణంలో వనామి రొయ్యల సాగు చేస్తున్నారన్నారు. ఆక్వా సాగుకు రైతు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు పొందలేదన్నారు. చనిపోయిన రొయ్యలను గోతిలో పాతిపెట్టారన్నారు. ఈ సంఘటనపై నిజ నిర్ధారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఎఫ్‌డిఓ రాజు తెలిపారు.