పశ్చిమగోదావరి

డయాలసిస్ సెంటరా.. ఆలోచిస్తాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, డిసెంబర్ 11: డయాలసిస్ సెంటరా.. ఆలోచిస్తామని వ్యాఖ్యానించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్. రూ.6 కోట్లతో నిర్మించిన భీమవరం ఏరియా ఆసుపత్రి అదనపు భవనానికి సోమవారం ఎంపీ గంగరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు, మున్సిపల్ ఛైర్మన్ కొటికలపూడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో డయాలసిస్ యానిట్ ఏర్పాటుచేయాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మంత్రిని కోరగా ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆ ప్రతిపాదనను పరిశీలిస్తానన్నారు. ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. అయితే 50 పడకలుగా ఉన్న ఈ ఆసుపత్రిని వంద పడకలుగా సిద్ధం చేయడానికి తాను సహకరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. వైద్యులు చిరునవ్వుతో రోగిని పలకరిస్తే వెంటనే సగం రోగం మాయమవుతుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగాయన్నారు. గతంలో కంటే ఎంతో అందంగా ఆసుపత్రులను తీర్చుదిద్దుతున్నామన్నారు. మంచి వాతావరణంలో ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయని తెలిపారు. నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ పాత ఆసుపత్రిని అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. అదే విధంగా వంద పడకలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందన్నారు. ఇదిలా ఉండగా మంత్రి కామినేని శ్రీనివాస్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును పొగడ్తలతో ముంచెత్తారు. నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి అని కొనియాడారు. మళ్ళీ అంజిబాబునే ఇక్కడ ప్రజలు గెలిపించుకోవాలన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ మామిడిశెట్టి ప్రసాద్, ఏఎంసీ ఛైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, టిడిపి రాష్ట్ర నాయకుడు మెంటే పార్థసారది, పట్టణ అధ్యక్షుడు తోట భోగయ్య, తెలుగు యువత అధ్యక్షుడు మద్దుల రాము తదితరులు పాల్గొన్నారు.

2019 నాటికి పూర్తిచేసి తీరతాం...
2018 మే నాటికి కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్ నిర్మాణం:పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు
పోలవరం, డిసెంబర్ 11: కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2019నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసి తీరతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. 2018 మే నాటికి కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్ నిర్మాణాలు పూర్తవుతాయన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో సోమవారం పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విలేఖర్ల సమావేశంలో ప్రాజెక్టు నిర్మాణానికి అయిన ఖర్చుల, పనుల వివరాలను తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించి స్పిల్ వేలో 11.61 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పని చేయాల్సివుండగా, ఇప్పటివరకు 28.25 శాతం అంటే 3.24 లక్షల క్యూబిక్ మీటర్ల పని పూర్తయ్యిందన్నారు. మట్టి పని 70 శాతం పూర్తయ్యిందని, మిగిలిన 30 శాతం 2018 మే నాటికి పూర్తవుతుందన్నారు. స్టిల్లింగ్ బేసిన్‌లో 4.43 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులకు గాను 1.07 లక్షల క్యూబిక్ మీటర్ల పని పూర్తయ్యిందన్నారు. డయాఫ్రం వాల్ 1427 మీటర్లుకుగాను 756.2 మీటర్లు పూర్తయ్యిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు గత ప్రభుత్వం రూ.5,135 కోట్లు ఖర్చుచేయగా, తెలుగుదేశం ప్రభుత్వం రూ.7,430 కోట్లు ఖర్చు చేసిందన్నారు. జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ఆమోదించినందున కేంద్ర ప్రభుత్వం రూ.4,329 కోట్లు చెల్లించిందని, ఇంకా రూ.3వేల కోట్ల వరకు రావలసివుందన్నారు. ప్రాజెక్టు కారణంగా 95వేల కుటుంబాలను పునరావాస గ్రామాలకు తరలించాల్సివుండగా అందులో 47 వేలు గిరిజన కుటుంబాలన్నారు. ప్రస్తుతం ఎకరాకు రూ.10 లక్షల వరకు పరిహారం చెల్లిస్తుండగా, కుటుంబానికి సుమారు రూ.18 లక్షల వరకు లబ్ధి చేకూరుస్తున్నామన్నారు. ప్రాజెక్టుకు 1,62,735.53 ఎకరాలు సేకరించాల్సివుండగా, 1,02,049 ఎకరాలు సేకరించామన్నారు. ఎనిమిది మండలాల్లో 200 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయన్నారు. ఇప్పటి వరకు 14 గ్రామాలకు పునరావాసం కల్పించామన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఏడు లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు 584 గ్రామాలకు తాగు నీరు అవసరాలు తీరతాయన్నారు. అలాగే రాష్ట్రంలోని నాలుగు నదుల అనుసంధానం జరుగుతుందని ముఖ్యమంత్రి వివరించారు.