పశ్చిమగోదావరి

నిప్పుల కొలిమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 15 : ఒకటే వేడి... మంటల్లాంటి ఎండలు... రాత్రి, పగలు ఒకటే ఉక్కపోత... దాదాపుగా వారం పది రోజుల నుంచి జిల్లా ప్రజానీకం పరిస్థితి ఇలాగే కొనసాగుతోంది. రోజురోజుకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో ప్రజానీకం అల్లాడిపోతున్నారు. ఎక్కడ చూసినా ఈ ఎండలు గురించే చర్చ. కొన్ని సందర్భాల్లో రానున్న వర్షాకాలం బాగుంటుందని, వర్షాలు బాగా కురుస్తాయన్న అంశం సేదతీర్చినట్లు కనిపించినా ఇప్పుడు ఉన్న ఎండలు మాత్రం ఒక రకంగా మాడ్చేస్తున్నాయనే చెప్పాలి. ఈసారి ఎండలు గట్టిగానే వుంటాయని ముందునుంచి అటు వాతావరణ శాస్తవ్రేత్తలు, ఇటు సామాన్యులు కూడా ఊహిస్తూనే వచ్చారు. దానికి తగ్గట్టుగా ఏప్రిల్ మొదటి నుంచి కూడా ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతూ వచ్చాయి. దీనికి తోడు వడగాల్పుల సెగ తీవ్రతరం కావడంతో సామాన్యుల కష్టాలు అన్నీ ఇన్నీ కాకుండా పోయాయి. పగటి పూట కార్యకలాపాలు దాదాపుగా సగానికి పైగా తగ్గిపోయాయంటే అతిశయోక్తి కాదు. మొత్తం మీద తాజా పరిస్థితి వృద్ధులను, పిల్లలను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉక్రాంతమయ్యేలా మార్చేస్తోందనే చెప్పాలి. గత కొద్దిరోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు దాదాపు 40 డిగ్రీల చేరువలోనే కొనసాగుతోంది. సాయంత్రం వేళల్లో కొంతైనా చల్లబడుతుందని ఆశించినా ఆ పరిస్థితి లేకుండా పోయింది. సాయంత్రం, రాత్రి కూడా ఉక్కపోత కొనసాగుతూనే వస్తోంది. చల్లటి గాలిని అనుభవించి ఎన్నాళ్లైందోనన్న ఆవేదనకూడా వినిపిస్తూనే వుంది. దీనికి పట్టణ, గ్రామీణ ప్రాంతాలన్న తేడా లేకుండా అన్ని చోట్లా మండే ఎండలు జనాన్ని మాడ్చేస్తున్నాయి. ఈ పరిస్థితుల కారణంగా పట్టణ ప్రాంతాల్లో రహదారులు దాదాపు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. జిల్లా కేంద్రమైన ఏలూరులోనూ ఇలాంటి పరిస్థితులే దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు ఒక్కసారిగా పెరిగిపోయిన ఉష్ణోగ్రతలు, కొనసాగుతున్న వడగాల్పులతో వృద్దులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా అనారోగ్య పరిస్థితులు కూడా పెద్దఎత్తున తలెత్తుతున్నట్లే కనిపిస్తోంది. దాదాపు ఆసుపత్రులన్నీ ఎండదెబ్బ తగిలిన వృద్దులు, పిల్లలతో కిటకిటలాడుతున్నాయంటే అతిశయోక్తికాదు. దీనికితోడు
మండుతున్న ఎండలు, అంతకుమించి కొనసాగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో అధిక శాతం మందికి శ్వాసకోశ ఇబ్బందులతోపాటు చర్మసంబంధ వ్యాధులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నట్లు కనిపిస్తోంది. వీటికి సంబంధించిన ఆసుపత్రులు కూడా కిటకిటలాడుతున్నాయనే చెప్పాలి. ఇక ఎండవేడిమిని జయించలేకపోయినా కనీసం ఉపశమనం పొందడానికి ప్రజలంతా ఇప్పుడు జ్యూస్ దుకాణాలను, కొబ్బరిబొండాలు, పుచ్చకాయలు వంటి వాటిని ఆశ్రయిస్తున్నారు. అయితే ఇవన్నీ తాత్కాలికంగా ఉపశమనాన్ని అందించినా గతానికి భిన్నంగా కొనసాగుతున్న ఉష్ణోగ్రతలు మాత్రం అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులలో పడవేస్తోంది. ఇక ఈ ఎండలు దాటికి తట్టుకోలేక స్థోమత పక్కనపెట్టి మరీ ఎయిర్‌కండీషనర్ల కొనుగోళ్లవైపు సామాన్య, మధ్య తరగతి వారు కూడా మొగ్గుచూపుతున్నారంటే ఆశ్చర్యం కాదు. ఇటీవల కాలంలో వీటి కొనుగోళ్లకు కూడా జీరో ఫైనాన్స్ వచ్చేశాయంటే వీటికి డిమాండ్ ఏ స్థాయిలో వుందో అర్ధం చేసుకోవచ్చు. ఏది ఏమైనా ఈ ఎండలు మరికొన్ని రోజులపాటు కొనసాగుతాయన్న అంచనాను వాతావరణ శాస్తవ్రేత్తలు వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో జనం కూడా వీటితో ఎలా వేగాలోనన్న ఆందోళనలోనే కొనసాగుతున్నారు. సామాన్యులు, మధ్యతరగతి ఉష్ణోగ్రతల కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటే కార్మిక వర్గం పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఎండలకు పని చేయలేక, పనిచేయకుంటే ఆదాయం లేక వారంతా ఒకరకంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారనే చెప్పాలి. ఏప్రిల్‌లోనే ఇలా వుంటే మేలో ఇంకెలా వుంటుందో ఆందోళన అన్ని వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది.