పశ్చిమగోదావరి

డ్రెడ్జింగ్ హార్బర్ నిర్మాణానికి ఒప్పందంపై సిఎంకు కృతజ్ఞతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసాపురం, ఏప్రిల్ 15: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది డ్రెడ్జింగ్ హార్బర్ నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు శుక్రవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎమ్మెల్యే మాధవనాయుడు మిఠాయిలు తినిపించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్రెడ్జింగ్ హార్బర్ నిర్మాణంలో భాగంగా ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ వశిష్ట నదిపై రోడ్డుకం రైల్వేబ్రిడ్జి నిర్మాణానికి మార్గం సుగమమైందన్నారు. డ్రెడ్జింగ్ హార్బర్, వశిష్ట వంతెన నిర్మాణం పూర్తయితే ఉభయగోదావరి జిల్లాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయనే ఆశాభావాన్ని ఎమ్మెల్యే వ్యక్తం చేశారు. డ్రెడ్జింగ్ హార్బర్ నిర్మాణానికి కృషిచేసిన సిఎం చంద్రబాబునాయుడు, కేంద్ర రహదారులు, నౌకశాఖ మంత్రి నితీష్ జయరామ్ గడ్కరీలకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవనాయుడు కృతజ్ఞతలు తెలిపారు.