పశ్చిమగోదావరి

ఇసుక తవ్వకాలకు బ్రేకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదవేగి, ఏప్రిల్ 15: పేద ప్రజలకు ఇళ్లు నిర్మించేందుకు ఉచితంగా ఇసుక అందించాలన్న ప్రభుత్వ ప్రయత్నానికి మొదటి రోజే బ్రేక్ పడింది. మండలంలోని బాపిరాజుగూడెం సమీపంలో తమ్మిలేరులో ఇసుక రీచ్‌ను ఏర్పాటు చేసి పేద ప్రజలకు 50 రూపాయలకే ఇసుక లోడ్ చేసేందుకు పోలీసు యంత్రాంగం రూరల్ సి ఐ నాగమురళీ, ఎస్ ఐ రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభించారు. అయితే బాపిరాజుగూడెం గ్రామస్తులు దీన్ని వ్యతిరేకిస్తూ ఇసుక లోడింగ్‌కు అడ్డుపడ్డారు. ఇసుకకు సంబంధించి రెవిన్యూ సిబ్బందిగానీ, భూగర్భ జల వనరుల శాఖ వారు గానీ సంబంధిత శాఖలు గానీ ప్రాతినిధ్యం వహించాలి కానీ ఇందులో పోలీసుల పాత్ర ఎందుకని గ్రామస్తులు ఎదురు తిరిగారు. లోడింగ్ చేస్తున్న ట్రాక్టర్‌ను అడ్డుకున్నారు. ప్రొక్లెయినర్లు పెట్టి ఇసుక తోడిస్తే అంతంతమాత్రంగా వున్న భూగర్భజలాలు మరీ అంతరించిపోయే ప్రమాదముందని, అందుకు సంబంధించిన శాఖ వారు పూనుకుని ఇసుక తీయాల్సివస్తే మనుషులతో తవ్వి లోడ్ చేయించుకోవాలని కోరారు. రూరల్ సిఐ నాగమురళీ మాట్లాడుతూ ఇసుక రీచ్‌లలో అవకతవకలు జరగకుండా పేదలకు పారదర్శకంగా ఇసుకను అందించేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు జిల్లా ఎస్‌పి సూచన మేరకు ఇసుక రీచ్‌లు ప్రారంభించామని, అయితే సంబంధిత రెవిన్యూ అధికారులను కూడా కలుపుకుని రీచ్‌లను ప్రారంభిస్తామని వెనుతిరిగారు. తవ్వకాలను అడ్డగించిన వారిలో విజయరాయి సొసైటీ అధ్యక్షులు బొప్పన సుధాకర్, ఎంపిటిసి బొప్పన మురళీకృష్ణ, సర్పంచ్ చొదిమెళ్ల ముక్కయ్య తదితరులున్నారు.