పశ్చిమగోదావరి

ప్రజా భాగస్వామ్యంతో రోడ్లు, డ్రెయిన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 15: జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో సిమెంటు రోడ్లు, భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి ప్రజా విరాళం కింద 25 శాతం సమకూరిస్తే మరో 75 శాతం నిధులను ఉపాధి హామీ, జడ్పీ నిధులు కింద మంజూరు చేస్తామని జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు తెలిపారు. ఏలూరు మండలం శనివారపుపేటలో శుక్రవారం 9, 11, 12 వార్డుల్లో నిర్మించిన సిమెంటు రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఉపాధి హామీ, జడ్పీ నిధులు 50 కోట్ల రూపాయలతో వివిధ గ్రామాల్లో సిమెంటు రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ప్రజావిరాళంతో ఏలూరు నియోజకవర్గంలో మొట్టమొదటిగా శనివారపుపేట గ్రామ పంచాయితీలో సిమెంటు రోడ్లు నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లాలో మిగిలిన గ్రామాల్లో కూడా రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి ముందుకు రావాలని కోరారు. సి ఎం చంద్రబాబు కృషి ఫలితంగా గ్రామీణాభివృద్ధికి ఉపాధి హామీ పధకం కింద 12500 కోట్ల రూపాయలు మంజూరయ్యాయన్నారు. ప్రతీ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజాభాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఏలూరు ఎంపి మాగంటి బాబు మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గాన్ని ఆహ్లదరకరంగా, సుందరవంతంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే బడేటి బుజ్జి పటిష్ట ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. పార్టీలకు అతీతంగా నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం వుందని చెప్పారు. శనివారపుపేట పంచాయితీలో శ్రీరామ్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ రోడ్ల నిర్మాణంలో భాగస్వాములైనందుకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలతో సమానంగా గ్రామీణ ప్రాంతాల్లో డ్రైన్లు, భూగర్భ డ్రైనేజీ, సిమెంటు రోడ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో జడ్పీటిసి మట్టా రాజేశ్వరి, ఎంపిపి రెడ్డి అనురాధ, గ్రామ సర్పంచ్ కూరపాటి లూర్ధమ్మ, వార్డు కౌన్సిలర్లు సూరా గంగారమణ, జంపన నాగేశ్వరరావు, ఆళ్ల సరస్వతమ్మ, ఎంపిడివో ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత 9వ వార్డులో నిర్మించిన సిసి రోడ్డును ఎంపి మాగంటి బాబు ప్రారంభించగా 11వ వార్డులో నిర్మించిన సిమెంటు రోడ్డును జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, 12వ వార్డులో నిర్మించిన సిమెంటు రోడ్డును ఎమ్మెల్యే బడేటి బుజ్జి ప్రారంభించారు. అనంతరం వారంతా ఆయా వార్డుల్లో మొక్కలు నాటారు.