పశ్చిమగోదావరి

తొమ్మిది మందిపై ఇసుక కేసులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, ఏప్రిల్ 15: పోలవరం గ్రామ పంచాయతీ పరిధిలో మహా నందేశ్వర స్వామి ఆలయం వద్ద ఇసుక దందా నిర్వహిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ కె శ్రీహరిరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక ఉచితం అని ప్రకటించినప్పటి నుండి మహానందీశ్వరస్వామి ఆలయం వద్ద ఇసుక తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ఒకరితో ప్రారంభమైన ఈ తవ్వకాలు అనేక మంది పొక్లెయినర్ తెచ్చుకుని లారీలపై ఎగుమతి చేయడం ప్రారంభించారు. మొదట్లో వెయ్యి రూపాయలుగా ఉన్న ఇసుక యూనిట్ ధర పోటీ విపరీతం కావడంతో రూ.200కు పడిపోయింది. ఆ ప్రాంతంలో 15 పొక్లెయినర్లతో ఇసుక తవ్వకాలు జరిగేవి. ఆ ర్యాంపు నుండి బయట ప్రాంతాలకు వెళ్లాలంటే పోలవరం గ్రామం మధ్య నుండే వెళ్లాల్సి రావడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు భయపడుడుతున్నారు. అప్పుడప్పుడు లారీల కారణంగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇలావుండగా గురువారం రాత్రి ఎస్‌ఐ కె శ్రీహరిరావు, విఆర్వోలు ఎం వెంకటేశ్వరరావు, జి గణపతిరావు, షరీఫ్‌లను వెంటబెట్టుకుని సరైన ధ్రువపత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్న 38 లారీలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే ఇసుక తవ్వుతున్న 12 పొక్లెయినర్లను గుర్తించామని ఎస్‌ఐ తెలిపారు. ఇసుక లోడుతో ఉన్న లారీలు అమ్మకానికి వెళ్తున్నాయో, సొంత వినియోగానికి వెళ్తున్నాయో విచారించి చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు. దాంతో శుక్రవారం నుండి పోలవరంలో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి.