పశ్చిమగోదావరి

వేసవిలో రెండు పూటలా తాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఏప్రిల్ 15: భీమవరం వాసులకు శుభవార్త... ఈ వేసవిలో పట్టణంలో రెండు పూటలా మంచినీరు సరఫరాచేయాలని మున్సిపాల్టీ ప్రణాళికలు సిద్ధంచేసింది. మున్సిపల్ ఛైర్మన్ కొటికలపూడి గోవిందరావు (చినబాబు) చొరవతో అధికార యంత్రాంగం కృషిచేసి, రెండు పూటలా నీరందించడానికి ప్రణాళిక సిద్ధంచేసింది.
ఎంతోకాలంగా అభివృద్ధికి నోచుకోని హెడ్ వాటర్ వర్క్స్‌పై మున్సిపల్ ఛైర్మన్ కొటికలపూడి గోవిందరావు ప్రత్యేక దృష్టిసారించారు. హెడ్‌వాటర్ వర్క్స్ అభివృద్ధితోపాటు భీమవరం పట్టణంలోని ప్రజల దాహార్తిని తీర్చేందుకు యాక్షన్ ప్లాన్‌ను కూడా సిద్ధం చేశారు. ఛైర్మన్ సలహాలు, సూచనల మేరకు అధికార యంత్రాంగం యాక్షన్ ప్లాన్‌ను రూపొందించింది.
హెడ్ వాటర్‌వర్క్స్ అభివృద్ధిపై దృష్టి
భీమవరం పురపాలక సంఘానికి ప్రధాన వనరుగా ఉన్న హెడ్ వాటర్ వర్క్స్‌ను అభివృద్ధి చేయనున్నారు. కేవలం పట్టణంలోని రహదారులు, డ్రెయిన్ల నిర్మాణమే కాకుండా పురపాలక సంఘానికి ఆయువుపట్టుగా ఉన్న హెడ్ వాటర్ వర్క్స్‌ను అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించనున్నారు. ఇప్పటికే ఛైర్మన్ కొటికలపూడి గోవిందరావు హెడ్ వాటర్ వర్క్స్‌ను తనిఖీ చేశారు. అక్కడ పంపింగ్ సిస్టం ఏవిధంగా ఉందో పరిశీలించారు. ప్రతీ నెల విద్యుత్తుకు ఎంత వ్యయమవుతుందో వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిఅండ్‌వి కెనాల్‌లో గోదావరి జలాలు ఏ మేర వస్తున్నాయి, ఏవిధంగా చెరువుకు పంపింగ్ చేస్తున్నారు, అక్కడి నుండి పంపు హౌస్‌కు చేరుకున్న నీటిని ఎన్నిస్థాయిల్లో ఫిల్టర్ చేస్తున్నారో తెలుసుకున్నారు. ముందుగా హెడ్ వాటర్ వర్క్స్ విద్యుత్ విధానాన్ని మార్పుచేయనున్నారు. దీనివల్ల ఏడాదికి లక్షలాది రూపాయలు మున్సిపాల్టీకి ఆదా కానున్నాయి. ఈ విద్యుత్ ప్లాంట్ స్థానంలో నూతన పరికరాలతో ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే పంపులు అవసరమైన మేరకు ఏర్పాటు చేస్తారు.
పురపాలక సంఘంలోని ప్రజలకు పూర్తిస్థాయిలో రెండుపూటలా నీరు అందించేందుకు 60 రోజుల ప్రణాళికను సిద్ధంచేశారు. ఇప్పటికే కొత్త, పాత పంపుల చెరువులు అత్యధిక స్థాయిలో నింపారు. వీటిలోని పాత పంపుల చెరువు నుండి చినరంగనిపాలెం, హౌసింగ్‌బోర్డు, ఎస్‌ఆర్-1, ఎస్‌ఆర్-2లకు నీటిని పంపిణీ చేస్తారు. కొత్త పంపుల చెరువు నుండి బ్యాంకుకాలనీ, గునుపూడి, శ్రీరాంపురం, ఎఎస్‌ఆర్ నగర్‌లకు పంపిణీచేశారు. ఈ ఎస్‌ఆర్‌ల నుండి కుళాయిలకు నీటిని అందిస్తారు. అంతేకాకుండా ఈ ఏడాది సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్‌తో మాట్లాడి మరిన్ని నిధులు తీసుకురావడానికి కృషిచేస్తున్నామని ఛైర్మన్ గోవిందరావు తెలిపారు.