పశ్చిమగోదావరి

మూడేళ్లలో ప్రతి పల్లెలో సిమెంటు రోడ్లకు ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 15: జిల్లాలో రానున్న మూడేళ్లలో ప్రతీ పల్లెలో సిమెంటు రోడ్లు నిర్మించడానికి జడ్పీ పటిష్టమైన ప్రణాళిక అమలుచేయాలని ఏలూరు ఎంపి మాగంటి బాబు జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజును కోరారు. స్థానిక ఆర్ ఆర్ పేటలోని ఎంపి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జడ్పీఛైర్మన్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జిలతో ఆయన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం పనులపై చర్చించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు రెండుకోట్ల పనిదినాలను కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించారని చెప్పారు. ఉపాధి హామీ పధకం పల్లెల ప్రగతికి అద్భుత వరంగా మారిందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో 600 కిలోమీటర్లకు పైబడి సిమెంటు రోడ్ల నిర్మాణానికి ఇప్పటి నుంచే ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన పేర్కొన్నారు. జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ జిల్లాలో తొలిసారి గ్రామీణ ప్రాంతాల్లో సిమెంటు రోడ్ల నిర్మాణంతోపాటు డ్రైన్ల అభివృద్ధికి 200 కోట్ల రూపాయలతో ఒక ప్రణాళిక అమలు చేశామని, ఈ ఏడాది పల్లెల్లో దాతల సహకారంతో మరింత అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ తన అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఏడు గ్రామాలున్నాయని, అక్కడున్న దళితుల కాలనీల్లో సిమెంటు రోడ్లతోపాటు డ్రైనేజీ సౌకర్యాన్ని కూడా కల్పించాలని నిర్ణయించామన్నారు.