పశ్చిమగోదావరి

నిరాశ మిగిల్చిన సిఎం పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేలేరుపాడు, ఏప్రిల్ 15: విలీనపోలవరం ముంపు మండలాల్లో బుధవారం జరిగిన సి ఎం చంద్రబాబునాయుడు పర్యటన నిర్వాసితులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఎప్పటి నుంచో పోలవరం ప్రాజెక్టు కారణంగా సర్వం కోల్పోయిన తమకు మెరుగైన పునరావాసం, నష్టపరిహారం కల్పిస్తామని అధికార యంత్రాంగం అనాధి నుంచి బాకాలు కొట్టడం అందరికీ తెలిసిందే. ఈ సందిగ్ధతను సాక్షాత్తూ ముఖ్యమంత్రి విలీన మండలాల పర్యటనలో భాగంగా స్పష్టం చేస్తారనే కొండంత ఆశతో పార్టీలకు అతీతంగా ప్రతీ మారుమూల గ్రామం నుంచి తండోపతండాలుగా కుకునూరులో బుధవారం సాయంత్రం జరిగిన సిఎం సభకు మండుటెండను సైతం లెక్కచేయక వేలాది మంది నిర్వాసిత ప్రజలు హాజరయ్యారు. తీరా ముఖ్యమంత్రి ప్రసంగం మొదలు అమలయ్యే పెన్షన్లు, రూపాయికి కిలో బియ్యం తదితర అంశాలను పదే పదే విన్నవించడమే తప్ప కొత్తదనమేమీ కనిపించకుండా సభను కొనసాగించడం ప్రజలకు విసిగెత్తించింది. ఒక వైపు పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది, ఈ మండలాలన్నీ ముంపునకు గురవుతాయని చెబుతూనే ఈ మండలాల్లో ప్రత్యేక ఐటిడిఏ కట్టిస్తాను, సబ్సిడీని ఏర్పాటు చేస్తాను, సిసి రోడ్లను ఏర్పాటు చేస్తాననడం నిరక్షరాస్యులను సైతం విస్మయానికి గురిచేసింది. ఈ విధంగా సి ఎం ప్రసంగం మొదలు ఆఖరి వరకు ఏ ఒక్క వ్యక్తిలో కనీసం సంతోషం లేకపోగా తీవ్ర నిరాశనిస్పృహలు మిగిలాయి. ఎంతో వరాల వర్షం కురిపిస్తారని, ఎన్నో భాజాలు మోగుతాయనుకున్న రాజకీయ పార్టీల నేతల్లో సైతం సిఎం ప్రసంగం నీరసాన్ని తెచ్చిపెట్టింది. తెల్లవారితే ప్రజల ముందుకెళ్లి తాము ఏ విధంగా వారిని ఒప్పించాలో అర్ధంకాని అయోమయ పరిస్థితి ఆ పార్టీ నేతల్లో నెలకొంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు ప్రక్రియ ఆరంభం మొదలు మొత్తం వేలేరుపాడు మండలంలోనే నూటికి 90 శాతం భూసేకరణను పూర్తి చేశారు.
ఇదే పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చిన కుకునూరు మండలంలో కేవలం పది శాతం మాత్రమే భూసేకరణ జరిగింది. ప్రస్తుతం అదే ప్రాజెక్టుకు జాతీయ హోదా రావడం, నూతన భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం, పునరావాసం వంటివి కేవలం వారికే వర్తిస్తాయని, చట్టాన్ని తిరగతోడలేమని, సాక్షాత్తూ ముఖ్యమంత్రే సభలో స్పష్టం చేయడంతో ఈ మాత్రం దానికి మీరు చేసేదేముంది, చట్ట పరిధిలోనే పునరావాసం, భూ నష్టపరిహారం నిర్వాసితులకు అందుతుంది కదా అని ప్రజలు ఒకింత మాట్లాడబోయే సరికి పోలీసులు వారి నోరు నొక్కేయడం విచారకరమని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఎద్దేవా చేస్తున్నాయి. కేవలం మాయమాటలతో మభ్యపెట్టేందుకే కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ముంపు మండలాల పర్యటన పేరుతో వృధా చేశారే తప్ప రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముంపు ప్రజలకు ఈ ముఖ్యమంత్రి ఒరగబెట్టిందేమీ లేదని సభకు హాజరైన నిర్వాసిత మహిళలు వివిధ పార్టీల నాయకులు బాహాటంగా ఆరోపించారు.