పశ్చిమగోదావరి

మంచినీటి చెరువులు కలుషితం కాకుండా చూసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 21 : జిల్లాలో సాగు, తాగునీరు అందించే పంట బోదెలు మంచినీటి చెరువులను కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై వుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన మీ-కోసం కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన వినతులను, ఫిర్యాదులను కలెక్టర్ భాస్కర్ స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కొన్ని చోట్ల సాగునీరు అందించే పంటబోదెలను ఆక్రమించుకోవడం వాటిని కలుషితం చేయడమే కాకుండా గ్రామాల్లో ఉన్న మంచినీటి చెరువులను సైతం ఇండ్లలోని వాడకం నీరు పంపడం ద్వారా కలుషితం చేస్తున్నట్లు అనేక ఫిర్యాదులు అందుతున్నాన్నారు. పంట బోదెలను సక్రమంగా ఉంచుకోవడం ద్వారా కలుషితం లేని సాగునీరు పంటలకు చేరి పంటలు సమృద్ధిగా పండుతాయని ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. అలాగే మంచినీటి చెరువులు కలుషితం అయితే ఆ నీటిని ప్రజలతోపాటు పశువులు కూడా తాగడం వలన అనారోగ్యం బారిన పడతున్నారని చెప్పారు. జిల్లాలో సాగునీటి పంట బోదెలు, తాగునీరుకు ఉపయోగపడే చెరువులను సంరక్షించుకుంటూ కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై వుందని చెప్పారు. ఈ సందర్భంగా అత్తిలి మండలం ఆరవల్లి గ్రామానికి చెందిన వెంకట సత్య నాగలక్ష్మి కలెక్టరుకు వినతిపత్రం అందిస్తూ గ్రామంలోని సర్వే నెంబరు 270 పంట బోదె గుండా సుమారు 300 ఎకరాలకు సాగునీరు అందుతోందని ఇదే పంటబోదె నుండి వచ్చే నీరు రెండు చెరువులకు అందుతోందని అయితే దగ్గరలోని కాలనీ వాసులు వాడకపు మురుగునీరు, లెట్రిన్ నీరును పంట బోదెలోకి విడిచిపెట్టడం వలన కలుషితనీరు పొలాలకు చెరువుల్లోనికి చేరి నీరు కలుషితం అయిపోతోందని చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ స్వయంగా పరిశీలించి వెంటనే అవసరైన చర్యలు తీసుకోవాలని డిపివో వెంకటరమణను కలెక్టర్ ఆదేశించారు. పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామానికి చెందిన ఆరేటి నాగ వెంకట అనంతలక్ష్మి వినతిపత్రం సమర్పిస్తూ తన ఇంటి నెంబరు 6-128/1 నకు ఇంటి పన్ను వేయవలసిందిగా కోరినప్పటికీ అధికారులుపట్టించుకోవడం లేదని అలాగే తన కుటుంబానికి మరుగుదొడ్డి సౌకర్యం లేక సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న మురుగుకాల్వ వద్దకు వెళ్లవలసి వస్తున్నదని గొల్లల కోడేరు గ్రామ పంచాయితీ సెక్రటరీని తమ కుటుంబానికి మరుగుదొడ్డి శాంక్షను చేసి నిర్మించాలని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. భీమడోలు బిసి కాలనీకి చెందిన కోటిపల్లి రాంబాబు కలెక్టరుకు వినతిపత్రం సమర్పిస్తూ గ్రామంలో కుళాయిలకు అక్రమంగా మోటార్లు బిగించి మంచినీటిని వాడుకోవడం వలన కాలనీల్లో మోటారు లేని మిగిలిన ప్రజలకు కుళాయిల ద్వారా నీటి సరఫరా ఆగిపోయిందని తద్వారా ప్రజలు మంచినీటికి ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో జెసి ఎం వేణుగోపాలరెడ్డి, డి ఆర్‌వో సత్యనారాయణ, హౌసింగ్ పిడి శ్రీనివాస్, డిపివో ముళ్లపూడి వెంకటరమణ, పంచాయితీరాజ్ ఎస్‌ఇ మాణిక్యం, ఎల్‌డిఎం సూర్యారావు, ఆర్ అండ్ బి ఎస్ ఇ నిర్మల, ఇరిగేషన్ ఎస్ ఇ రఘునాధ్, డ్వామా, డి ఆర్‌డి ఏ, గృహ నిర్మాణ శాఖ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.