పశ్చిమగోదావరి

విద్యతోనే దేశాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆచంట, జూలై 5: ప్రతిఒక్కరూ చదువుకోవాలని, చదువుకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖా మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. గురువారం పెనుగొండలో నూతనంగా ఏర్పాటుచేసిన శ్రీవాసవీ మహిళా జూనియర్ కళాశాలను మంత్రి పితాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికం చదువుకు ఆటంకం కారాదని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం విద్యకు మంచి ప్రోత్సాహం అందించి ప్రతీ నిరుపేద చిన్నారులకు ఉన్నత చదువుల కోసం అనేక అవకాశాలు కల్పిస్తుందన్నారు. ఈ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరమే 150 మంది విద్యార్థినులు చేరడం శుభపరిణామమన్నారు. ఈ విద్యాసంస్థను వ్యాపార సంస్థగా చూడకుండా సేవాభావంగా చూడాలని, ఇందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తానని మంత్రి నిర్వాహకులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పెనుగొండ, ఆచంట ఏఎంసీ ఛైర్మన్లు సానబోయిన గోపాలకృష్ణ, ఉప్పలపాటి సురేష్‌బాబు, కళాశాల సంచాలకులు, జడ్పీటీసీ రొంగల రవికుమార్, కర్రి లక్ష్మీనారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ విడిఎల్ నర్సమాంబ, రవికుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.