పశ్చిమగోదావరి

వరద గోదారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, జూలై 15: గోదావరి నదికి వరద తిరిగి పెరుగుతోంది. ఆదివారం సాయంత్రం పోలవరం సిడబ్ల్యుసి వద్ద 9.88 మీటర్లుగా నమోదైంది. రెండు రోజుల వరకు పెరిగిన వరద ఒక మీటరు మేర తగ్గి ఆదివారం ఉదయం నుండి నెమ్మదిగా పెరుగుతోంది. కడెమ్మ స్లూరుూస్ తలుపుల వద్దకు వరద నీరు పోటెత్తడంతో పొలాల పైనుండి వచ్చే వర్షం నీరు గోదావరిలోకి వెళ్లడం లేదు. ఈ కారణంగా భారీ వర్షాలకు వరి నారుమళ్లు నీట మునిగాయి. మరో రెండు రోజులు ఆకుమళ్లు నీట మునిగితే కుళ్లిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గోదావరికి తిరిగి వరద రావడం, శనివారం తూర్పుగోదావరి జిల్లాలో పడవ ప్రమాదం జరిగిన దృష్ట్యా పేరంటాలపల్లి వెళ్లే టూరిజం బోట్లను, ఫెర్రీ పాయింట్ల వద్ద లాంచీల రాకపోకలను బోటు సూపరింటెండెంటు జి ప్రసన్నకుమార్ తాత్కాలికంగా నిలిపివేశారు. ఆదివారం ఉదయం నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల మూడు సెం.మీ వర్షపాతం నమోదైంది.

‘అల’జడి
మొగల్తూరు, జూలై 15: వాయువ్య బంగాళఖాతంలోఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో మొగల్తూరు మండలం పేరుపాలెంలో సముద్ర అలలు ఎగసి పడుతున్నాయి. మండలంలో మొగల్తూరు, దర్భరేవు, వెస్ట్ కుక్కలేరు, మాగలేరు, గొంతేర్రు, బొంతేరు డ్రెయిన్లు పొంగి ప్రవహిస్తున్నాయి. తీర గ్రామాలైన కెపి పాలెం సౌత్, పేరుపాలెం సౌత్ పాతపాడు గ్రామాల్లో మత్య్సకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తహసీల్దారు శ్రీపాద హరినాధ్ వీఆర్వోల ద్వారా ఈ మేరకు ప్రచారం చేశారు. కాగా మండలంలో శని, ఆదివారాలు కురిసిన భారీ వర్షాలు ఉపయోగకరంగా ఉంటాయని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు. ఈ వర్షాల కారణంగా జాతీయ రహదారి విస్తరణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.
కుంగిన నెక్లెస్ బండ్ గట్టు
పోలవరం, జూలై 15: పోలవరం గ్రామానికి రక్షణగా నిర్మించిన నెక్లెస్ బండ్ గట్టు ఇటీవల కురిసిన వర్షాలకు కుంగి మట్టి రోడ్డుపై జారుతోంది. నెక్లెస్ బండ్‌కు చెందిన పాత పోలవరం వద్ద ఉన్న గట్టు నుండి జారిన మట్టి ప్రాజెక్టుకు వెళ్లే మార్గంపై పడి బురదమయం కావడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి వరదల నుండి పోలవరం గ్రామానికి రక్షణగా ఉంటుందని సుమారు మూడు కోట్ల రూపాయలతో నెక్లెస్ బండ్ నిర్మించారు. దీని నిర్మాణానికి స్పిల్ ఛానల్ నిర్మాణం కోసం తీసిన మట్టిని ఉపయోగించడంతో మట్టి గట్టిపడకుండా వర్షాలకు జారిపోతోంది. మరింత భారీ వర్షాలు కురిస్తే ప్రాజెక్టు నిర్మాణానికి వెళ్లే రోడ్డుపైకి భారీగా మట్టి చేరే అవకాశం ఉంది. అధికారులు స్పందించి మట్టి జారకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.