పశ్చిమగోదావరి

జాతీయరహదారి దిగ్బంధం అడ్డుకున్న పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 19: శ్రీ పీఠాధిపతి స్వామి పరిపూర్ణానందపై విధించిన నగర బహిష్కరణను తెలంగాణా ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ బిజెపి, విహెచ్‌పి, భజరంగదళ్, ఆర్‌ఎస్‌ఎస్ తదితర సంఘాలు గురువారం ఇచ్చిన జాతీయరహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం నుంచి బిజెపి నేతలను గృహనిర్బంధం చేసిన పోలీసులు విహెచ్‌పి, భజరంగదళ్, ఆర్‌ఎస్‌ఎస్ నేతలను కార్యాలయం నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. కొంతమంది త్రీటౌన్‌కు తరలించారు. అనంతరం వారిని విడిచిపెట్టారు. స్ధానిక ఫిరంగుల దిబ్బకు చెందిన గండికోట చినరంగారావు, విద్యానగర్‌కు చెందిన వేల్పూరి రామశేషు, శాంతినగర్‌కు చెందిన గణపతిరాజు శ్రీనివాసరాజులను త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేసి అనంతరం విడుదల చేశారు. టుటౌన్ పోలీసులు కత్తి రాము, వులవల సాయి, నాగం శివ, అడిదం వంశీకృష్ణలను అరెస్టు చేసి అనంతరం విడిచి పెట్టారు. కాగా ఈ అరెస్టులను, నిర్బంధాలను నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. స్ధానిక విహెచ్‌పి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో విహెచ్‌పి జిల్లా అధ్యక్షులు కాకి సురేష్‌కుమార్ మాట్లాడుతూ హిందు మతం విశ్వాసాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోలేని ప్రభుత్వాలు నగర బహిష్కరణ చేసి చేతులు దులుపుకోవటం దారుణమన్నారు. పరిపూర్ణానంద స్వామిపై విధించిన హైదరాబాద్ నగర బహిష్కరణను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విహెచ్‌పి కార్యదర్శి జి నాగరాజు, భజరంగదళ్ జిల్లా కన్వీనర్ రామనపూడి శివప్రసాద్, బిజెపి నగర కార్యదర్శి గాది రాంబాబు, బిజెపి సోషల్ మీడియా ఇన్‌ఛార్జి భీమవరపు సుబ్రహ్మణ్యం, భజరంగదళ్ నగర కన్వీనర్ పి దుర్గాప్రసాద్, విహెచ్‌పి నగర కార్యదర్శి రుూవని భాస్కర్, ఫణిభూషణ్ రాజు తదితరులు పాల్గొన్నారు.

పోలీసులు మొక్కలు నాటాలి
* ఎస్పీ రవిప్రకాష్ పిలుపు
ఏలూరు, జూలై 19: ప్రతి పోలీసు ఉద్యోగి పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపట్టాలని జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ పిలుపునిచ్చారు. స్ధానిక డిఎస్పీ కార్యాలయ ఆవరణలో గురువారం వనం-మనం కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల భూతాపం తగ్గుతుందని, ఇటీవలకాలంలో అడవులను పాడుచేయటం వల్ల వన్యమృగాలు కనుమరుగవుతున్న నేపధ్యంలో సరైన సమయానికి వర్షాలు లేకపోవటం వల్ల ప్రజలు కాలుష్యం బారినపడుతున్నారన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు కూడా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, ప్రతి కానిస్టేబుల్ పది మొక్కలు చొప్పున, మిగిలిన ఎస్సై, ఇతర అధికారులు 20 మొక్కలు చొప్పున నాటాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎఆర్ అదనపు ఎస్పీ ఎం మహేష్‌కుమార్, ఏలూరు డిఎస్పీ కె ఈశ్వరరావు, ఒన్‌టౌన్ సిఐ అడపా నాగమురళి, టుటౌన్ సిఐ మధుబాబు, త్రీటౌన్ సిఐ పి శ్రీనివాసరావులతోపాటు పలువురు ఎస్సైలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.