పశ్చిమగోదావరి

ఊపందుకున్న రాష్టప్రతి పర్యటన ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకివీడు, డిసెంబర్ 19: రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ ఈనెల 25వ తేదీన ఆకివీడు మండలం అయిభీమవరం గ్రామానికి రానున్న సందర్భంగా ఏర్పాట్లు ఊపందుకున్నాయి. అయిభీమవరం రోడ్డు నుండి గ్రామనడిబొడ్డు వరకు ఆర్‌అండ్‌బి రహదారికి మరమ్మతులు ప్రారంభించారు. అలాగే అయిభీమవరం రోడ్డులో ఆదర్శ కానె్వంట్ ఎదురుగా ఉన్న విశాలమైన ప్రాంగణంలో మూడు హెలిప్యాడ్‌లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. వేదపాఠశాల ప్రాంగణం, సాయిబాబా మందిరాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. వేదపాఠశాల ప్రాంగణంలో వేసిన గులాబీ మొక్కలు తదితర వాటిని శనివారం పరిశుభ్రం చేస్తున్నారు.
రాష్టప్రతి పర్యటన ప్రాంతాలను పరిశీలించిన డిఐజి
ఏలూరు రేంజ్ డిఐజి హరికుమార్ ఆకివీడు మండలం అయిభీమవరం గ్రామంలో రాష్టప్రతి పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. హెలిప్యాడ్, వేదపాఠశాల, సాయిబాబా మందిరం, సభాప్రాంగణం, పార్కింగ్, విఐపిలు వేచి ఉండే స్థలాలను శనివారం రాత్రి పరిశీలించారు. డిఐజి వెంట డిఎస్పీ అమర్‌నాథ్ నాయుడు, రూరల్ సిఐ జయసూర్య, ఆకివీడు ఎస్సై కడియాల అశోక్‌కుమార్ తదితరులున్నారు.

ప్రేక్షకులను నవ్వించడమే ధ్యేయం
హాస్యనటుడు గుండు సుదర్శన్
వీరవాసరం, డిసెంబర్ 19: ప్రేక్షకులను నవ్వించడమే తన ధ్యేయమని ప్రముఖ సినీ హస్యనటుడు గుండు సుదర్శన్ (డాక్టర్ సూరంపూడి సుదర్శనరావు) పేర్కొన్నారు. తోలేరులో గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర కళాపరిషత్ ఆధ్వర్యంలో రాష్టస్థ్రాయి నాటిక పోటీల్లో భాగంగా శుక్రవారం రాత్రి గుండు సుదర్శన్‌ను కళాపరిషత్ అధ్యక్షుడు చవ్వాకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ ఇప్పటివరకు 300 చిత్రాల్లో తాను నటించానని తెలిపారు. తాను చిత్రరంగానికి రాక ముందు భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశానని తెలిపారు. 1992వ సంవత్సరంలో ప్రముఖ సినీ దర్శకులు బాపురమణలు దూరదర్శన్‌లో నవ్వితే నవ్వండి అనే జోక్స్ కార్యక్రమాన్ని చిత్రీకరిస్తుండగా మిత్రుని సలహాతో దర్శకుడు బాపూను కలిశానన్నారు. ఆయన ప్రోత్సాహంతో నవ్వితే నవ్వండి జోక్సులో నటించానన్నారు. అనంతరం మహానటుడు నందమూరి తారక రామారావుతో బాపు దర్శకత్వంలో తీసిన విశ్వనాథ కవి సార్వభౌమ శ్రీనాథుడు చిత్రంలో మొట్టమొదటిసారిగా నటించడం తన అదృష్టమని తెలిపారు. మిస్టర్ పెళ్ళాం సినిమాతో తనకు మంచి కమెడియన్‌గా పేరొచ్చిందన్నారు. తన చిన్నతనంలో అత్తిలి పాఠశాలలో 6వ తరగతి చదువుకుంటున్న రోజుల్లో మొండి గురువు.. బండ శిష్యుడు నాటికలో బండ శిష్యుడి పాత్రను పోషించానన్నారు. సీనియర్ నటులు ఎన్టీఆర్, ఎఎన్నార్‌తో నటించడం తన అదృష్టమన్నారు. యువకెరటం పవన్‌కళ్యాణ్‌తో జల్సా సినిమాలో నటించానన్నారు. ఎన్నో పాత్రలు చెయ్యాలని ఉన్నా సినిమాలో కమెడియన్‌గా తనను చూసి ప్రేక్షకులు నవ్వుకోవడం వల్ల వారికి ఆరోగ్యం కలుగుతుందని, అందుకే కమెడియన్‌గా చిత్ర పరిశ్రమలో ఉండాలనుకుంటున్నానని తెలిపారు.