పశ్చిమగోదావరి

పవన్ ఆశయాల కరదీపిక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఆగస్టు 14: ‘అత్యున్నత పర్వతమూ... అతి దీర్ఘ నదీ ప్రవాహమూ... అతి లోతైన సముద్రము... అతి దూరపు నక్షత్రము ఉన్నపుడు అత్యుత్తమ మానవుడెందుకు ఉండడు...?’ ప్రఖ్యాత కవి గుంటూరు శేషేంద్రశర్మ రచించిన ‘ఆధునిక మహాభారతం’ గ్రంథంలోని వాక్యాలివి... శేషేంద్ర శర్మ, దేవరకొండ బాల గంగాధరతిలక్ రచనలను అమితంగా ఇష్టపడే, మరోవిధంగా చెప్పాలంటే నిత్యం వాటిని స్మరించుకునే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్‌ను ఈ ఐదు వాక్యాలతోనే ఆరంభించారు. సాంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నంగా అవినీతి భూతాన్ని తరిమికొట్టి, అన్ని కులాలు, మతాలు, ప్రాంతాల ప్రజలు సమాన హక్కులతో ప్రశాంతంగా జీవించే సమాజం తీసుకొస్తానంటూ 2019 ఎన్నికల బరిలోకి దిగబోతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజన్ డాక్యుమెంటులోనూ తనదైన ముద్ర చూపించుకున్నారు... ‘అత్యున్నత మహనీయులైన మానవులు ఉండబట్టే మనం స్వాతంత్య్రం సాధించుకోగలిగాము, బలమైన రాజ్యాంగాన్ని తీసుకురాగలిగాము.. ఎంతోమంది మహనీయులు వారి జీవితాన్ని అర్పించి మన దేశానికి స్వాతంత్య్రం వచ్చేటట్టుచేసి, బ్రిటీష్ వారి దాస్య శృంఖలాల నుండి మనందరికీ విముక్తి కలిగించారు’ అని విజన్ డాక్యుమెంటులో పేర్కొన్నారు. మహోన్నతమైన గుణాలను కలిగిన మేధావులు ఎన్నో సంవత్సరాలపాటు మథించి, శోధించి 1950లో భారత రాజ్యాంగాన్ని రచించి, భావి తరాలకు దశ, దిశలను, విధివిధానాలను పొందుపరిచారని పేర్కొన్నారు. మేథోసంపన్నుడు దూరదృష్టిగల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సారధ్యంలో ఎందలో నిష్ణాతులు రాజ్యాంగ రచనా క్రతువులో పాల్గొని మన దేశానికి రూపు రేఖలు తీర్చిదిద్దారని, భారత రాజ్యాంగ లక్ష్యం, సిద్ధాంతాలను రాజ్యంగ పీఠిక (ప్రియాంబుల్)లో పొందుపరిచారని పేర్కొన్న పవన్ కళ్యాణ్ ప్రభుత్వాలు, వివిధ రాజకీయ పక్షాలు ఈ రాజ్యాంగ పీఠికకు తూట్లు పొడిచారని ఆవేదన వ్యక్తంచేశారు. సంపూర్ణమైన అభివృద్ధి నుండి ప్రజలను దూరంచేశారని పేర్కొన్నారు. ప్రజలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా విడదీశారని, కులాలు, మతాలు, ప్రాంతాల పేరిట ప్రజల మధ్య భేదభావాలను సృష్టించారని ఆందోళన వ్యక్తంచేశారు. ‘చేసేది చెప్పం’ అన్నరీతిలో పాలకులు వంచన రాజకీయాలతో దేశాన్ని ఏలుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఆర్భాటంగా మేనిఫెస్టో ప్రకటించే రాజకీయ పక్షాలు ఎన్నికల తర్వాత వాటిని మొక్కుబడిగానైనా అమలుచేయకపోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేని, రాజకీయ జవాబుదారీతనం ఏ రాజకీయ నాయకుడిలోనూ వీసమెత్తు గోచరించడంలేదని పేర్కొన్నారు.
మేనిఫెస్టో అమలును అతిక్రమించడంవల్ల సంపద అందరికీ సమానంగా చేరడంలేదని, కొన్ని కుటుంబాలు, వారి బంధువులు, వారి కనుసన్నల్లో మెలిగే సిండికేట్లు వేల కోట్ల రూపాయలను వెనకేసుకుంటున్నారని పవన్ కళ్యాణ్ తన విజన్ డాక్యుమెంట్‌లో ఆందోళన వ్యక్తంచేశారు. అభివృద్ధి ఫలాలు అతికొద్ది మందికే చేరడంతో ఆర్థికంగా బలమైన వారు మరింత బలవంతులుగా, ఆర్థికంగా బలహీనం ఉన్నవారు మరింత బలహీనులుగా మారి, కుల, మత, ప్రాంత, వివక్షలతో కునారిల్లుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దీనికి చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యక్తిగతంగా, సమిష్టిగా బాధ్యత వహించాల్సివొందన్నారు. ప్రజాస్వామ్యానికి పీఠాలైన చట్టసభల్లో శాసనకర్తలు కొద్దిమంది బాగుకోసం కోట్లాది మంది ప్రయోజనాలను పణంగా పెట్టడం జాతికే తీరని ద్రోహమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
‘నేను డ్యాములెందుకు కడుతున్నానో... భూములెందుకు దున్నుతున్నానో నాకు తెలియదు! నా బ్రతుకొక సున్న కానీ నడుస్తున్నా! వేళ్లు కాళ్లయి నడిచే చెట్టు మనిషి, చెట్టుగా ఉంటే ఏడాదికొక వసంతమన్నా దక్కేది, మనిషినై అన్ని వసంతాలూ కోల్పోయాను!’ అన్న గుంటూరు శేషేంద్రశర్మ ఆధునిక మహాభారతంలోని వాక్యాలను పేర్కొంటూ ఈ పరిస్థితుల నుండి ప్రజలను రక్షించాలని, వారికి మంచి ప్రమాణాలతో కూడిన జీవనాన్ని అందించాలని, తాగడానికి పరిశుద్ధమైన నీరు, కలుషితం కాని గాలి, ఆరోగ్యకరమైన పరిసరాలు ప్రతి ఒక్కరికీ దక్కేలా జనసేన పాటుపడుతుందని పవన్ కళ్యాణ్ తన విజన్ డాక్యుమెంట్‌లో హామీయిచ్చారు.