పశ్చిమగోదావరి

చంద్రబాబుకు మద్దతు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాగల్లు, సెప్టెంబర్ 20: అన్ని వర్గాల్లో పేదలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందజేయడానికి ప్రతిష్టాత్మకంగా కృషిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతునిచ్చి ప్రోత్సహించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ అన్నారు. మండలంలోని కలవలపల్లి, రామచంద్రపురం గ్రామాల్లో గురువారం జరిగిన గ్రామదర్శిని-గ్రామవికాసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కలవలపల్లి గ్రామాన్ని రూ 8.23 కోట్లతో అభివృద్ధి చేసినట్టు తెలిపారు. మరో రూ. 8 కోట్లతో పేద వర్గాలకు వ్యక్తిగత లబ్ధిని చేకూర్చామన్నారు. ప్రభుత్వ పాలన 1500 రోజులు పూర్తయిన సందర్భంగా చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలియజేశారు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా వయోవృద్ధులు, వితంతువులు, చేనేత, గీత మత్స్య కళాకారులకు రూ. 1500 పింఛనుగా ఇస్తామన్నారు. పింఛన్లు రూ. 200 నుండి రూ. 1000కి పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందన్నారు. మండలంలో చంద్రన్న బీమా పథకంలో అయిదుగురికి రూ. 4.8 లక్షలు అందజేశామన్నారు. ప్రభుత్వం రూ.16 వేల కోట్ల అప్పుల్లో ఉన్నా ఇచ్చిన హామీలు గానీ, అభివృద్ధి గానీ ఆపలేదన్నారు. పుట్టిన దగ్గర నుండి స్థిరపడేవరకు వివిధ పథకాల ద్వారా ప్రయోజనం చేకూర్ఛిన సంఘటన దేశంలో ఎక్కడా లేదన్నారు. రామచంద్రపురంలో 90 శాతం సీసీ రోడ్లు, ఇళ్ల అవసరాలను తీరుస్తామన్నారు. మట్టి రోడ్డు గానీ, తాటాకిళ్లు గానీ ఉండకూడదనే లక్ష్యంతో కృషిచేస్తున్నట్టు తెలిపారు. ఎస్సీల ఇళ్ల నిర్మాణానికి రూ. లక్షా 50 వేల నుండి రూ. 2 లక్షలకు పెంచారని తెలిపారు. త్వరలో గ్రామంలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో మంత్రి జవహర్‌ను ప్రజలు ఘనంగా సత్కరించారు. ఏఎంసీ ఛైర్మన్ వేగి చిన్న, ఎంపీపీ కోడూరి రమామణి, బొడ్డు రాజు, గారపాటి కాశీ, కోడూరి ప్రసాద్, ఎం రవికుమార్, సీతారాం, కొండేపాటి వెంకటేశ్వరరావు, ప్రత్యేకాధికారి జగ్గారావు తదితరులు పాల్గొన్నారు.

పోలీసులు జవాబుదారీతనం అలవర్చుకోవాలి
* జిల్లా ఎస్పీ రవిప్రకాష్
తాళ్లపూడి, సెప్టెంబర్ 20: పోలీసులు జవాబుదారీతనాన్ని అలవరచుకోవాలని, జిల్లాలో పోలీస్ వ్యవస్థ పూర్తి పారదర్శకతతో పనిచేస్తోందని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం ఎస్పీ తాళ్లపూడి పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. తాళ్లపూడి వచ్చిన ఎస్పీ రవిప్రకాష్‌కు కొవ్వూరు డిఎస్పీ వెంకటేశ్వరరావు, రూరల్ సిఐ శరత్‌కుమార్, ఎస్‌ఐ దాసు మర్యాదపూర్వకంగా కలుసుకుని, పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో ఎస్పీ మొక్కలు నాటారు. అనంతరం ఎస్పీ రవిప్రకాష్ మాట్లాడుతూ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ల తీరు కచ్ఛితంగా ఉంటే కిందిస్థాయి ఎస్‌ఐ నుంచి అందరి పనితీరు బాగుంటుందన్నారు. ప్రజలకు స్టేషన్‌కు వచ్చిన సమయంలో వారిని పట్టించుకోకపోయినా, న్యాయం జరగడం లేదని అనుమానం కలిగినా, తన వాట్సాఫ్ నంబరుకు మెసెజ్ పంపించ వచ్చన్నారు. తాళ్లపూడి పంచాయతీ పరిధిలో ఇసుక రవాణా ఇబ్బందులూ, ట్రాఫిక్ అంశాలపై వచ్చిన ఆరోపణలను చాలా వరకు పరిష్కరించినట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాలను ఆర్‌టిజీకి అనుసంధానం చేస్తున్నట్టు ఎస్పీ వెల్లడించారు. తాళ్లపూడి మండలంలో జరిగిన పలు సంఘటనల్లో కేసులు తప్పుదోవ పట్టాయన్న అంశంపై పరిశోధన చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.

జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం
నరసాపురం, సెప్టెంబర్ 20: పట్టణంలోని కోటిపల్లివారి వీధిలో గురువారం జనసేన పార్టీ (జేఎస్పీ) కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ పార్టీ రాష్ట్ర నాయకులు రాఘవయ్య, ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్త కలవకొలను నాగతులసీరావు, జిల్లా సమన్వయకర్తలు ఇర్రింకి సూర్యారావు, యర్రా నవీన్, కనకరాజు సూరిలు ముఖ్య అతిథులుగా విచ్చేసి జేఎస్పీ కార్యాలయన్ని ప్రారంభించారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కోశాధికారి, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు మారిశెట్టి రాఘవయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో జేఎస్పీకి అన్ని వర్గాల నుంచి అపూర్వ రీతిలో ఆదరణ లభిస్తోందన్నారు. ప్రజాభిమానంతో రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో జేఎస్పీ పోటీ చేస్తుందన్నారు. నరసాపురం నియోజకవర్గంలో జేఎస్పీ అభ్యర్థిని గెలిపించి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు కానుకగా ఇవ్వాలన్నారు. దీనిని నిమిత్తం పార్టీ శ్రేణులు ఇప్పట్నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే మండల, పట్టణ కమిటీలను త్వరలో భర్తీ చేస్తామని రాఘవయ్య తెలిపారు. అనంతరం చిరు వ్యాపారులకు ఎండ నుంచి రక్షణ పొందేందుకు గొడుగులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు బర్రె జయరాజు, మైల వీర్రాజు, డాక్టర్ ఇలపకుర్తి ప్రకాష్, కోటిపల్లి వెంకటేశ్వరరావు, అందే రవికుమార్, సిహెచ్ దానయ్యనాయుడు, డాక్టర్ చినిమిల్లి అప్పాజీ, డాక్టర్ మాదంశెట్టి కోటేశ్వరరావు, వలవల నాని, కోపల్లి శ్రీను, అడ్డాల రాంబాబు, కర్నేని లక్ష్మీనారాయణ, లక్కు బాబి, పార్టీ వీర మహిళలు గ్రంధి అనసూయ, పోలిశెట్టి నళిని, మెరిపే దివ్యశ్రీ, అరుణ తదితరులు పాల్గొన్నారు.