పశ్చిమగోదావరి

బిందుసేద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 25: మెట్టప్రాంత రైతులు బిందుసేద్య వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చి మంచి ఫలితాలు సాధించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎపిఎంఐపి ప్రాజెక్టు అధికారి ఎం సూర్యప్రకాష్ అధికారులను ఆదేశించారు. స్ధానిక కలెక్టరేట్‌లో మంగళవారం ఎపిఎంఐపి అధికారులు, డ్రిప్ కంపెనీ కో-ఆర్డినేటర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యాన, వ్యవసాయ పంట సాగులో సాగునీటి యాజమాన్యం చాలా ప్రధానమైందన్నారు. సకాలంలో పడని వర్షాలు, తగ్గిపోతున్న వర్షపాతం సాగునీటి నిర్వహణ ప్రాముఖ్యతను పెంచాయన్నారు. ప్రస్తుత పరిస్దితుల్లో అందుబాటులో ఉన్న సాగునీటి వనరుల సద్వినియోగానికి బిందుసేధ్యం రైతులకు ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. నూరుశాతం నీటి ఆదా, తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగు చేసేందుకు ఏకకాలంలో అన్నిచెట్లకు ఒకేసారి నీరు అందించేందుకు బిందుసేధ్యం ఉపయోగపడుతుందన్నారు. అంతేకాకుండా బిందుసేధ్యం వల్ల 50 శాతం విద్యుత్ ఆదా అవుతుందని, తక్కువ సమయంలో చెట్లకు కావాల్సినంత నీరు రాత్రిపూట కూడా అందించవచ్చునన్నారు. బిందుసేద్యంపై డెల్టాప్రాంత రైతులకు పూర్తిస్ధాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. జిల్లా షుగర్ కేన్ అసిస్టెంట్ కమిషనర్ సీతారామయ్య మాట్లాడుతూ ఎక్కువమంది రైతులు ప్రస్తుతకాలంలో ఉద్యానవన పంటల వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. చెరకు పంటకు లేబర్ అధికంగా ఖర్చు అవుతున్నందున రైతులు చెరకు ఉత్పత్తిని బాగా తగ్గించారని, 2005లో రాష్ట్రంలో 40 వేల హెక్టార్లలో చెరకుపంట పండించేవారని, ప్రస్తుతం 8 వేల హెక్టార్లలో మాత్రమే చెరకు పండిస్తున్నారన్నారు. చెరకు రైతులకు బిందుసేధ్యంపై పూర్తి అవగాహన కలిగించి అధికోత్పత్తులు సాధించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఎపిఎంఐపి పిడి షాజానాయక్, ఓఎస్‌డి హిమబిందు, ఉద్యానవనశాఖ ఎడి దుర్గేష్, వ్యవసాయాధికారి వరలక్ష్మి, ఐటిడిఎ పిఓఎ కుమారి, ఫినోలెక్స్ జిల్లా కోఆర్డినేటరు పి రవికుమార్, ఎపిఎంఐపి డిసిఓలు తదితరులు పాల్గొన్నారు.