పశ్చిమగోదావరి

ప్రతి పాఠశాలలో డిజిటల్ తరగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, సెప్టెంబర్ 26: డిజిటల్ తరగతిలో ప్రతీ పాఠశాలలో బోధన జరగాలన్నదే ప్రభుత్వ ఆశయమని జిల్లా పరిషత్ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అన్నారు. ద్వారకాతిరుమల మండలం గున్నంపల్లి జడ్పీ హైస్కూల్లో బుధవారం ఆయన డిజిటల్ తరగతి గదిని ప్రారంభించారు. అలాగే జడ్పీ నిధులు రూ.5లక్షలతో నూతనంగా ఏర్పాటుచేసిన మంచినీటి బోరును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాపిరాజు మాట్లాడుతూ సాంకేతిక విద్యతో కూడిన పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందజేసినప్పుడే వారు ఇష్టంతో పాఠాలను అవగాహన చేసుకుంటారన్నారు. దీన్ని గుర్తించిన తమ ప్రభుత్వం డిజిటల్ తరగతి ద్వారా బోధన జరగాలని ఆదేశించిందని పేర్కొన్నారు. ఇందు నిమిత్తం జడ్పీ నిధులతోపాటు దాతలు సైతం డిజిటల్ తరగతుల ఏర్పాటుకు నిధులను సమకూరుస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని పాఠశాలల్లో ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని చదువులో రాణించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మొగతడకల లక్ష్మీరమణి, ఎంపీపీ వడ్లపూడి ప్రసాద్, మాజీ ఎంపీపీ ఏపూరి దాలయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కౌలు రైతు రక్షణ, సంక్షేమానికై పాదయాత్ర
ఏలూరు, సెప్టెంబర్ 26 : రాష్ట్రంలోని కౌలు రైతులకు రక్షణ కల్పించాలని, వారి సంక్షేమాన్ని కాపాడాలని కోరుతూ అక్టోబర్ 10 నుంచి 31వ తేదీ వరకు కాకినాడ నుంచి గుంటూరు వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య తెలిపారు. బుధవారం స్థానిక పవర్‌పేటలోని అనే్న వెంకటేశ్వరరావు భవనంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరారు. కౌలు రైతుల రక్షణ కోసం వారి సంక్షేమాన్ని ఆశిస్తూ కాకినాడలో ఈ నెల 10వ తేదీన పాదయాత్రను ప్రారంభించి గుంటూరు వరకు 500 కిలోమీటర్ల దూరం 200 గ్రామాల గుండా కొనసాగుతుందని, పాదయాత్ర ముగింపు సందర్భంగా అక్టోబర్ 31న గుంటూరులోని వ్యవసాయ కమిషనరేట్ నందు వేలాది మంది రైతులతో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. 2011 భూ అధీకృత సాగుదారు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని అమలు చేయకుండా కౌలు రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శించారు. చట్ట ప్రకారం కౌలు రైతులందరికీ రుణ అర్హత గుర్తింపు కార్డులు ఇచ్చి వడ్డీ లేని పంట రుణాలు, నష్టపరిహారాలు, బీమా పరిహారాలు, వ్యవసాయ రాయితీలు అందించాలని కోరారు. కౌలు రైతులకు పంట రుణాలు అందక ప్రైవేటు అప్పులపైనే ఆధారపడి వ్యవసాయం చేయాల్సి వస్తుందని, అధిక వడ్డీలతో నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ రాధాకృష్ణ కమిషన్ అధ్యయనంలో రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలు రైతులు వున్నట్లు లెక్కలు తేల్చారని వివరించారు. వ్యవసాయంలో నష్టపోతున్న కౌలు రైతులకు పెట్టుబడి వ్యయంగా ఎకరాకు పది వేల రూపాయలు ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. పంట రుణాలతోపాటు కౌలు చెల్లింపు మొత్తాన్ని రుణంగా ఇవ్వాలన్నారు. ఎపి రౌతు సంఘం అప్‌లాండ్ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఎర్రకాలువ, తమ్మిలేరు, గోదావరి ముంపు, భారీ వర్షాలు వలన పంటలు నష్టపోయిన కౌలు రైతులకు తక్షణమే పరిహారం అందించాలన్నారు. పంటల బీమా పరిహారం వారికే ఇవ్వాలన్నారు. మొక్కజొన్న ధరల వ్యత్యాస పధకం పరిహారం రైతాంగానికి వెంటనే అందించాలని కోరారు.