పశ్చిమగోదావరి

కవాతుకు సై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, అక్టోబర్ 14 : జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కవాతుకు సై అంటూ ముందుకు సాగుతున్నారు. సోమవారం ధవళేశ్వరం బ్యారేజీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కవాతు నిర్వహించాలని చేసిన నిర్ణయం మేరకు దాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. జనం మొత్తం జనసేన కవాతు గురించే మాట్లాడుకోవాలి... దేశ వ్యాప్తంగా ఇంకో విషయానికి తావు లేకుండా ఈ కవాతును ఆసక్తిగా చూపాలి... దీనికి అనుగుణంగా భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యేలా చూడాలని జనసేనాని ఇచ్చిన మార్గదర్శకాల మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలను పెద్ద ఎత్తున తరలించేందుకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గాల వారీగా ప్రణాళికలను సిద్ధం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజాపోరు యాత్రను విడతల వారీగా నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 15న ధవళేశ్వరం బ్యారేజీపై కవాతు నిర్వహించాలని నిర్ణయించడం తెలిసిందే. ఉభయగోదావరి జిల్లాల నుంచి సుమారుగా మూడు లక్షల మంది జనసైనికులు పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధినేత ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీనికి అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు. ఎక్కడికక్కడ పోస్టర్లను ఆవిష్కరిస్తు ప్రజల్లో అవగాహనను పెంచేందుకు కృషి చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కవాతు ఘన విజయం సాధించేలా చూడాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేస్తున్నారు. కార్యక్రమం జరిగే కొవ్వూరు సహా నిడదవోలు, పోలవరం నియోజకవర్గాల నుంచి భారీగా జనసమీకరణ చేయాలని నిర్ణయించారు. డెల్టా నియోజకవర్గాల్లోని జన సైనికులను ధవళేశ్వరం తరలించాలని నిర్ణయించారు. జిల్లా, మండల స్థాయిల్లో కమిటీలను ఇంకా నియమించకపోయినా స్థానిక నాయకులు, సినీ నేతల ఆధ్వర్యంలోనే కవాతు సమీకరణ ప్రణాళికలను ముందుకు తీసుకువెళుతున్నారు. జనసేన నాయకులు ఇర్రింకి సూర్యారావు, యర్రా నవీన్, కనకరాజు సూరి, కలవకొలను తులసీరావు వంటి సీనియర్ నేతలు ఆయా నియోకజవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి పవన్ అభిమానులను, కార్యకర్తలను కవాతులో పాల్గొనేలా చూస్తున్నారు. జనసేనకు పట్టున్న నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టి పెట్టి కవాతుకు జనసమీకరణకు శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా తెలంగాణ జిల్లా నుంచి కూడా పవన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి వంటి జిల్లాల నుంచి కూడా జనసేన సైనికులు ఈ కవాతులో పాల్గొనేందుకు తరలివచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ ఆరు తెలంగాణా జిల్లాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఆ జిల్లా నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పశ్చిమకు తరలి వస్తారని భావిస్తున్నారు. జనసైనికులు ఉపయోగించే బస్సులు, టూవీలర్లు, వివిధ వాహనాలకు జనసేన పార్టీ జెండాతోపాటు జాతీయ జెండా కూడా కట్టాలని మార్గదర్శకాలు వెలువడ్డాయి. రాజకీయాల్లో జవాబుదారీతనం అవసరమనే నినాదంతోపాటు దేశ భక్తి, జాతీయాభిమానం కూడా అంతే అవసరమని పవన్ కళ్యాణ్ చెబుతుండటంతో దానికి అనుగుణంగా పార్టీ జెండాతోపాటు జాతీయ జెండాను కూడా కట్టాలని నిర్ణయించారు. ఏది ఏమైనా సోమవారం జరగనున్న జనసేన కవాతుకు ఉభయగోదావరి జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో కార్యకర్తలను తరలించేందుకు ప్రణాళికలను అమలు చేస్తున్నారు.