పశ్చిమగోదావరి

హిందూ సంస్కృతీ సంప్రదాయాలకు ఆత్మీయ సమ్మేళనాలు చిహ్నాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, నవంబర్ 16: సనాతన హిందూ సంస్కృతీ సంప్రదాయాలకు ఆత్మీయ సమ్మేళనాలు చిహ్నాలని రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ యామిజాల నరసింహమూర్తి అన్నారు. చినవెంకన్న క్షేత్రంలోని వైఖానస ఆగమ పాఠశాల ఆవరణలో ఈనెల 20న నిర్వహించనున్న అపూర్వ తెలుగు బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమ ఆహ్వాన పత్రికలను శుక్రవారం ఆయన స్వామి సన్నిధిలో ఉంచారు. అనంతరం వీటిని బ్రాహ్మణ సేవాసంఘ సమాఖ్య జిల్లా అధ్యక్షుడు సత్యవాడ దుర్గాప్రసాద్‌తో కలిసి ఆలయ అధికార్లకు, అర్చకులకు, పండితులకు, ఆగమ పాఠశాల అధ్యాపకులకు, విద్యార్థులకు అందజేసి వారిని సగౌరవంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా యామిజాల మాట్లాడుతూ ఈసమ్మేళనానికి విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపనందేంద్ర సరస్వతి మహాస్వామీజీవారు విచ్చేసి తమ అనుగ్రహ భాషణ ఇస్తారన్నారు. అలాగే ఈకార్యక్రమానికి విశిష్ట అతిథులుగా టీటీడీ పాలకవర్గ సభ్యులు డొక్కా జగన్నాథం, జయజయ శంకర్ టీవీ ఛానల్ ఛైర్మన్ చిలకలపూడి వెంకట ప్రసాదశర్మ హాజరవుతారని తెలిపారు. ఆ రోజు 9గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, 11 గంటలకు స్వామీజీకి పూర్ణకుంభ స్వాగతం, ఆ తరువాత మధ్యాహ్నం ద్వారకాతిరుమల, హంపి విరూపాక్ష పీఠం ఆస్థాన సిద్ధాంతి కాశీభొట్ల కృష్ణప్రసాద్ శాస్ర్తీ దంపతులకు సత్కారం, మధ్యాహ్నం ఒంటి గంటకు మహాకార్తీక వనమారాధన ప్రారంభమవుతుందని ఆయన వివరించారు. జిల్లావ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే బ్రాహ్మణ బంధువులకు ద్వారకాతిరుమలలోని షణ్ముఖ రెసిడెన్సీలో ఉచిత వసతి సౌకర్యం ఏర్పాటుచేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ నేతలు పరిమి సీతారామ్, గోవర్ధనం కృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు.