పశ్చిమగోదావరి

ప్రభుత్వ పనితీరును తెలుసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 16 : రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక ఇబ్బందుల్లో వున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమయస్ఫూర్తితో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా అమలుచేస్తున్నారని, తద్వారా సమాజంలో పేదరికం నిర్మూలన అయ్యిందని రాష్ట్ర ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అన్నారు. శుక్రవారం పెదపాడు మండలం కొక్కిరపాడు గ్రామంలో గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చింతమనేని పాదయాత్రగా ఇంటింటికీ వెళ్లి ప్రజల నుంచి సమస్యలను తెలుసుకున్నారు. వాటిలో పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు గాను సంబంధిత అధికార ఉద్యోగులను ఆదేశించారు. డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎన్‌టి ఆర్ గృహ నిర్మాణ పధకం ద్వారా మంజూరైన లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని, క్రిష్టమస్ కల్లా ప్రారంభోత్సవాలుజరగాలని సూచించారు. ఇప్పటికే గ్రామంలో 80 శాతం రోడ్లు సిసి రోడ్లుగా మార్పు చేశారని, మిగిలిన రోడ్లు కూడా సిసి రోడ్లుగా రూపకల్పన చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ది పర్చడమే ధ్యేయంగా టిడిపి ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు, రేషన్‌కార్డులు అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. డ్వాక్రా గ్రూపులకు లక్షలాది రూపాయలు రుణాలుగా అందజేసామని స్పష్టం చేశారు. గ్రామీణులు ఐకమత్యంగా ఉండబట్టి సంక్షేమ పధకాలు సక్రమంగా అందుతున్నాయని పేర్కొన్నారు. నెలకొన్న సమస్యలు ఈ సంవత్సరంలోనే పూర్తవుతాయని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దెందులూరు ఎ ఎంసి ఛైర్మన్ మాగంటి సురేంద్రనాధ్ చౌదరి, పెదపాడు ఎంపిపి మోరు శ్రావణి, మాజీ జడ్పీటిసి గారపాటి రామసీత, మండల టిడిపి అధ్యక్షులు గుత్తా అనిల్‌కుమార్, వి ఆర్‌వో సైదు శ్రీరామ్‌కుమార్‌లతోపాటు పలువురు అధికారులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతమనేనికి గ్రామస్తులు పూలమాలలతో, తీన్‌మారు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. గజమాలలతో సత్కరించి బాణాసంచా కాల్చి ఉత్సాహాన్ని గ్రామస్తులు చూపించారు.
పత్రికల ఆవశ్యకతపై అవగాహన అవసరం
కామవరపుకోట, నవంబర్ 16: సమాజంలో పత్రికల ఆవశ్యకత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనావుందని ఎమ్మెల్సీ రాము సూర్యారావు అన్నారు. శుక్రవారం కామవరపుకోటలోని శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన 51వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. పత్రికల పరిస్థితి, విలేఖర్ల స్థితిగతులను ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఏ పత్రికలో ఏముందో తెలుసుకోవడంతోపాటు ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న విషయాలను కూడా అవగతం చేసుకోవాల్సిన అవసరముందని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో అభ్యుదయ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు బీఎన్ సాగర్, లోకేష్ సేవాసమితి అధ్యక్షుడు ఆకుమర్తి రామారావు, స్థానిక జడ్పీటీసీ సభ్యుడు గంటా సుధీర్‌బాబు, మానవత సంస్థ కామవరపుకోట కన్వీనర్ కె కనకరాజు, సీపీఐ కార్యదర్శి టీవీఎస్ రాజు, స్థానిక లైబ్రేరియన్ బంగారు పాప పాల్గొన్నారు.