పశ్చిమగోదావరి

రహదారులపై చెత్త వేస్తే జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తణుకు, డిసెంబర్ 6: వ్యర్థపదార్ధాలను ఇక నుంచి రహదారులపై వేసేవారికి భారీ పెనాల్టీ తప్పదని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. గురువారం స్థానిక భోగవల్లి బాపయ్య, అన్నపూర్ణమ్మ కాకతీయ కల్యాణ మండపంలో ఏపీ కాలుష్య నివారణ మండలి ఆధ్వర్యంలో ఘన వ్యర్థాల నిర్వహణ, నియమాలపై పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన జిల్లాస్థాయి శిక్షణా సదస్సుల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మంచి ఆరోగ్యం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజలంతా సహకరించాలని కోరారు. ఈ నేపథ్యంలో కాలుష్య రహిత వ్యవస్థ కోసం జరిగే కృషిలో అందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, వ్యర్థపదార్థాలను చెత్తబుట్టలో మాత్రమే వేయాలని సూచించారు. ఈ వ్యర్థ పదార్థాలను పునర్వినియోగం కోసం చేపట్టే సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచాయతీ కార్యదర్శులు ఆకళింపుచేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్‌ను గ్రామాల్లో అమలుచేస్తే పర్యావరణ పరిరక్షణ ఉంటుందన్నారు. దీని ద్వారా సంపూర్ణ ఆరోగ్యం చేకూరగలదన్నారు. రెండు మూడు నెలల్లో నూరు శాతం కాలుష్య రహిత వ్యవస్థను అమలుచేసేందుకు సంబంధిత ఉద్యోగులంతా ప్రయత్నించాలని ఆదేశించారు. దీని కోసం యాక్షన్ ప్లాన్ తయారుచేసుకోవాలని కలెక్టర్ సూచించారు. చెత్తను కాలువల్లోకి విసిరేయటం వల్ల నీరు పూర్తిగా కాలుష్యమవుతోందన్న విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకున్న మాదిరిగానే వీధులను కూడా శుభ్రంగా ఉంచుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో వ్యర్థపదార్థాలను తరలించేందుకు కంపోస్టు యార్డులను నిర్మించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే ప్లాస్టిక్‌ను వినియోగించేవారిపై ఎక్కువ మొత్తంలో జరిమానా విధించాల్సి ఉంటుందని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లా పంచాయతీ అధికారి వి నాగార్జునసాగర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో డీఎల్పీవో సిహెచ్ చిన్నారావు, కాలుష్య నియంత్రణామండలి, పర్యావరణ ఇంజినీర్ ఎస్ వెంకటేశ్వర్లుతోపాటు జిల్లాకు చెందిన పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.