పశ్చిమగోదావరి

ముగిసిన జాతీయ చెస్ పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉంగుటూరు, డిసెంబర్ 12: ఉంగుటూరు మండలం నారాయణపురంలో గత నాలుగు రోజులుగా జరిగిన జాతీయస్థాయి అండర్-19 చెస్ పోటీలు బుధవారం ముగిశాయి. హోరాహోరీ పోరులో బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. మహారాష్ట్ర బాలికల జట్టుకు వెండి పతకం, తమిళనాడు జట్టుకు రజత పతకం లభించింది. అలాగే బాలుర విభాగంలో కేరళ జట్టుకు స్వర్ణ, తమిళనాడుకు వెండి, మహారాష్టక్రు రజత పతకం లభించాయి. నాలుగు రోజులు జరిగిన ఈ పోటీలకు అన్ని రాష్ట్రాలకు చెందిన 23 బాలుర జట్లకు సంబంధించి 115 మంది, బాలికలు విభాగంలో 22 జట్లకు చెందిన 110 మంది క్రీడాకారిణులు పాల్గొన్నారు. విజేతలకు కళాశాల ప్రిన్సిపాల్ వి సోమశేఖర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ తిరుపాణ్యం షీల్డులు, సర్ట్ఫికెట్లు అందించారు. పరిశీలకులు కులదీప్ అయ్యర్, సుశుకుమార్, డాక్టర్ రాజేష్ పర్యవేక్షించారు. కార్యనిర్వాహకులు ఆదిరెడ్డి సత్యనారాయణ, ఐజాక్ ఆధ్వర్యం వహించారు.

గ్రీన్‌ఫీల్డ్ హైవే సర్వే అధికారులను ప్రతిఘటించిన రైతన్నలు
*నచ్చజెప్పే ప్రయత్నం చేసిన కేఎన్‌జే ప్రాజెక్టు అధికారులు
జంగారెడ్డిగూడెం, డిసెంబర్ 12: మండలంలోని పుట్లగట్లగూడెంలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే సర్వేకు వచ్చిన రెవెన్యూ, నేషనల్ హైవే అథారిటీకి చెందిన కేఎన్‌జే ప్రాజెక్టు అధికారులను బుధవారం రైతులు ప్రతిఘటించారు. వారం రోజుల్లో గ్రామానికి రావడం మూడోసారని, రైతులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, నష్టపరిహారం ఎంత చెల్లిస్తారో చెప్పకుండా తమ భూముల్లోకి ప్రవేశించి ఇష్టానుసారంగా రాళ్లు పాతుకుంటూ పోతే సహించేదిలేదని, కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా రాజ్యాంగ బద్ధంగా నడుచుకోవాలని, చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని రైతులు అధికారులను నిలదీశారు. ఈ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించిందని, ఏకపక్షంగా రైతుల భూముల్లో ఇష్టానుసారంగా సర్వే రాళ్లు వేసుకుంటూ పోతే అధికారులకు ప్రతిఘటనలు తప్పవన్నారు. అధికారులు, ప్రభుత్వం కూడా చట్టాలకు, రాజ్యాంగానికి లోబడే పనిచేయాలని గుర్తుంచుకోవాలన్నారు. తహసీల్దార్ టి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలోకి సర్వే బృందాలతో వచ్చినప్పుడల్లా నేషనల్ హైవే అథారిటీ వారితో వివరణ ఇప్పించాలని కోరారని, అందుకే ఈ రోజు అథారిటీకి చెందిన కేఎన్‌జే ప్రాజెక్ట్ అధికారులిద్దరు రైతులకు వాస్తవ పరిస్థితులు వివరించేందుకు వచ్చినట్టు తెలిపారు. రైతులతో భూసేకరణపై చర్చించారు. రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రైతులకు సరైన నష్టపరిహారం చెల్లించాకే రహదారి పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. అయినప్పటికీ పుట్లగట్లగూడెంలో నష్టపరిహారం ప్రకటించిన తరువాత సర్వే చేసుకోవాలని, ఈ గ్రామంలో పార్కింగ్ పేరుతో మూడు రహదార్లకు సరిపడా భూములు సేకరించడానికి వీలులేదని రైతులు పట్టుబట్టారు. ఈ సమస్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని రైతులకు తహసీల్దార్ హామీ ఇచ్చారు. కేఎన్‌జే అధికారులు, రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బంది గ్రామం వీడి వెళ్లిపోయే వరకు రైతులు అక్కడే ఉండి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ శీలం రామచంద్రరావు మాట్లాడుతూ రహదారి నిర్మాణానికి భూసేకరణ వరకు అభ్యంతరం లేదని, పార్కింగ్ పేరుతో గ్రామంలో ఉన్న భూమి అంతా తీసేసుకోవాలనుకోవడం సహించరానిదన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ పునరాలోచించాలని కోరారు. నేషనల్ హైవే అధికారులు ఎలైన్‌మెంట్ మార్చుకోవాలని, పార్కింగ్ స్థలాల పేరుతో సాగు భూములన్నీ ఇచ్చేయాలని కోరడం సరికాదన్నారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శీలం కృష్ణంరాజు, వైసీపీ మండల అధ్యక్షుడు వామిశెట్టి హరిబాబు, బీజేపీ మండల అధ్యక్షుడు పారేపల్లి వీరవెంకట సత్యనారాయణ, రైతు నాయకులు అప్పన భాస్కరరావు, శీలం వెంకటరావు, తలారి నాగార్జున, కంకిపాటి నాగేశ్వరరావు, పారేపల్లి నాగేశ్వరరావు, చంటి తదితరులు పాల్గొన్నారు.
పంగిడిగూడెంలో కొనసాగుతున్న నిరసన దీక్షలు
పరిహారం ప్రకటించే వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే సర్వే పనులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పంగిడిగూడెంలో పంగిడిగూడెం, పేరంపేట, రాజవరం తదితర గ్రామాల రైతులు చేపట్టిన నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం గ్రామానికి వచ్చిన నేషనల్ హైవే అథారిటీకి చెందిన కేఎన్‌జే ప్రాజెక్ట్ అధికారుల ఎదుట నిరసన తెలిపి నినాదాలు చేశారు. విలువైన సారవంతమైన భూముల్లో రహదారి నిర్మాణం చేయాలనుకోవడం, ఉన్న రహదార్లను అభివృద్ది చేయలేకపోవడం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమని రైతులు విమర్శించారు. బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే ప్రభుత్వాలకు తగిన గుణపాఠం తప్పదన్నారు. రైతుల నోట్లో మట్టికొట్టే ప్రాజెక్టులు విరమించుకోవాలని, ఇప్పటికే కాలువలు, సాగునీటి ప్రాజెక్టుల పేరుతో రైతుల వద్ద ఉన్న భూములు లాగేసుకున్నారని, ఇప్పుడు ఉన్న రహదార్లను అభివృద్ధి చేయలేక చతికిలపడిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేడు కొత్త రహదారి పేరుతో సాగు భూములు లాక్కోవాలని చూస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. తహసీల్దార్ టి శ్రీనివాస్ హైవే సర్వే పనులపై రైతులకు వివరణ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఈ హైవే నిర్మాణానికి అనుమతిచ్చినందున, సర్వేచేసి భూములు ఏ మేరకు హైవేకు అవసరమో నిర్ణయిస్తారని, తరువాత పరిహారం ప్రకటించి, భూసేకరణ చేస్తారని వివరించారు. దీనిపై రైతులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో రైతు నాయకులు ముళ్లపూడి గంగాధర శ్రీనివాస్, కాసగాని భాస్కరరావు, కవులూరి విజయభాస్కరరావు, గరికిపాటి వెంకట నాగేశ్వరరావు, పసుపులేటి రవీంద్ర, వందనపు సాయిబాబు, ఇమ్మణ్ణి విష్ణురావు, బిళ్ల సత్యనారాయణరెడ్డి, గోలి సుబ్బారెడ్డి, జుజ్జవరపు శ్రీరామకృష్ణ, గోలి సత్తిరెడ్డి, ఇర్ల శ్రీనివాసరెడ్డి, కారుమూరి పిచ్చిరెడ్డి, బిళ్లా వెంకటరెడ్డి, బిళ్లా రామిరెడ్డి, గోలి మహంకాళమ్మ, బిళ్లా సత్తిరెడ్డి, పర్రెడ్డి సోమిరెడ్డి, తంగెళ్ల సత్యనారాయణ, అరటికట్ల సుబ్రహ్మణ్యం, వందనపు హరి, వత్సవాయి వర్మ, పైడేటి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.