పశ్చిమగోదావరి

కోడి పందాల బరుల వద్ద 144 సెక్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జనవరి 8: సంక్రాంతి పండుగ నేపథ్యంలో మూడు రోజుల పాటు సంప్రదాయం మాటున జరిగే కోడి పందాల విషయంలో రెవెన్యూ, పోలీసులు కఠిన చట్టాలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే పోలీస్ యాక్టు 30 అమల్లోకి తీసుకువచ్చిన జిల్లా ఎస్పీ రవిప్రకాష్ కోడి పందాల బరుల వద్ద పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని మంగళవారం రాత్రి ఆదేశాలు జారీచేశారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటా జరుగుతున్న బరులను గుర్తించి అక్కడ పోలీస్ పికెటింగ్‌ను ఏర్పాటుచేస్తున్నారు. ఇక రెవెన్యూ విషయానికి వస్తే సంక్రాంతి వేడుకల్లో కోడి పుంజుల పందాలు, అసాంఘిక జూదాలు జరగకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ కఠిన చర్యలకు పూనుకున్నారు. వెంటనే తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. స్థానికంగా గుర్తించిన బరులను గుర్తించి అక్కడ 144 సెక్షన్ అమలు చేయాలని ఆదేశాలు జారీచేశారు. భీమవరం పట్టణం, భీమవరం మండలంలోను 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్టు భీమవరం తహసీల్దార్ చవాకుల ప్రసాద్ చెప్పారు. ఈ నెల 20 వరకు కోడి పందాల బరుల వద్ద 144 సెక్షన్‌ను అమల్లోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఫ్లెక్సీలు, మైకు ప్రచారాలు ద్వారా ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తామన్నారు.

సకాలంలో అందని ధాన్యం సొమ్ము
*బీజేపీ నిరసన
వీరవాసరం, జనవరి 8: ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన మూడురోజుల్లో రైతుల ఖాతాలకు సొమ్ము చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ప్రస్తుతం అమలు జరగడంలేదని బీజేపీ నాయకులు ఆరోపించారు. మంగళవారం మండల బీజేపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు కోడి నరసింహం మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆన్‌లైన్ చేసిన మూడురోజుల్లో సొమ్ము చెల్లింపులు జరుగుతున్నప్పటికీ రైతుల ఖాతాల్లో మాత్రం జమ కావడంలేదన్నారు. దీనితో సార్వా పంటకు రైతులకు పెట్టుబడుల్లేక అప్పులు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. రైసుమిల్లర్ల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి 15రోజుల్లో ప్రభుత్వానికి బియ్యం ఇవ్వాలనే నిబంధన వల్ల రైసుమిల్లర్లు రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యం బియ్యంగా మార్చి ప్రభుత్వానికి ఇవ్వలేకపోతున్నారని వారు పేర్కొన్నారు. 15రోజుల్లో బియ్యం ఇవ్వని పక్షంలో డీఎం, స్టేట్ కమిషనర్ రైసుమిల్లులను లాకింగ్‌లో పెడుతున్నారని, ఇది చాలా దారుణమన్నారు. అలా రైసుమిల్లులను లాకింగ్‌లో పెట్టి ఆంక్షలు విధించడం వల్ల రైసుమిల్లర్లు రైతు ఖాతాలకు సొమ్ములు చెల్లించలేకపోతున్నారని బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అడ్డాల రామకృష్ణ, కురెళ్ల నరసింహారావు, ఆకుల లీలాకృష్ణమూర్తి, కొల్లి వెంకట్రావు, గండి దుర్గామహేష్, దగ్గు రమణకుమారి, ఆకుల సునీల్‌చక్రపాణి, వేండ్ర దివాకర్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో ప్రతి ఇంటికీ కుళాయి
-రూ.880 కోట్లు మంజూరు -ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ అమరేశ్వరావు
ఉంగుటూరు, జనవరి 8: జిల్లాలలోని ప్రతీ ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.880 కోట్లు నిధులు మంజూరు చేసిందని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ అమరేశ్వరావు తెలిపారు. మంగళవారం ఉంగుటూరు మండలంలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడారు. జిల్లాకు 12,332 మరగుదొడ్లు నిర్మాణానికి నిధులు మంజూరైనట్టు తెలిపారు. నెల రోజుల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేయాల్సి ఉందన్నారు. ప్రతీ ఇంటికి ట్యాపులు ఇచ్చే పనులకు టెండరు పిలుస్తున్నామని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఎస్‌ఈ తెలిపారు.

నూతన వంగడాల సృష్టిలో ప్రథమస్థానం
కొవ్వూరు ఉద్యాన పరిశోథనా స్థానం స్వర్ణోత్సవాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి:ప్రయోగశాలకు ప్రారంభోత్సవం
కొవ్వూరు, జనవరి 8: నూతన వంగడాలను సృష్టించడం ద్వారా కొవ్వూరు ఉద్యాన పరిశోథనా స్థానం జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి తెలిపారు. స్థానిక ఉద్యాన కేంద్రం స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంగళవారం కేంద్రం శాస్తవ్రేత్త డాక్టర్ కె కృష్ణ భగవాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణోత్సవాల్లో మంత్రులు సోమిరెడ్డి, కెఎస్ జవహర్‌లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా రూ.1.94 కోట్లతో నిర్మించిన ఉద్యాన పరిశోధనా కేంద్రం ల్యాబ్‌ను మంత్రులు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన రైతు సదస్సులో మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.5 కోట్ల వ్యయంతో వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులకు వ్యవసాయ యంత్రాలను అందజేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో స్థిరమైన అభివృద్ధి రేటు సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. రూ.1400 కోట్లతో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టుకు వ్యయం చేస్తున్నట్టు తెలిపారు. రూ.420 కోట్లను పంటల బీమా పథకం కింద రైతులకు నష్టపరిహారాన్ని అందజేస్తున్నట్టు చెప్పారు. రైతుల పొలాల్లో మట్టి పరీక్షలు నిర్వహించటంతోపాటు విత్తనాలు, ఎరువులను సబ్సిడీపై అందజేస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఈ నాలుగున్నర సంవత్సరాల్లో రాష్ట్రం దేశంలోనే ప్రప్రథమంగా నిలిచిందన్నారు. ముఖ్యంగా బిందు సేద్యం పథకానికి ప్రభుత్వం అత్యధిక ప్రాథాన్యత ఇచ్చిందన్నారు. బిందు సేద్యం పథకంలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉండగా, గుజరాత్ రాష్ట్రం 5వ స్థానంలో ఉందని చెప్పారు. ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి మాట్లాడుతూ రైతులకు అదనపు ఆదాయం నిమిత్తం ఉద్యానవన పంటలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఉద్యానవన పంటల విస్తీర్ణం ఇంకా పెరగాల్సి ఉందన్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధనకు అవసరమైన సాగు వ్యవసాయ నిర్వహణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షపాతం తక్కువగా నమోదైనా ఉత్తమ యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడి సాధనకు అధికారులు కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్టును అమలు చేస్తున్నారన్నారు. అనంతరం రైతు పథకం కింద రైతు రథాలను లబ్ధిదారులకు మంత్రులు అందజేశారు. ఉద్యానవన పంటలపై ప్రచురించిన పుస్తకాలను మంత్రులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్డీవో వై సత్యనారాయణరావు, శాస్తవ్రేత్తలు కె మమత, ఆర్ నాగలక్ష్మి, కె రవీంద్రబాబు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ డి రాజారమేష్, ఏఎంసీ ఛైర్మన్ వేగి చిన్న, అనేక మంది రైతులు పాల్గొన్నారు.
నియంతలా వ్యవహరిస్తున్న మోదీ
అనంతరం మంత్రి జవహర్ కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి ఇవ్వవలసిన నిధులు ఇవ్వకుండా ప్రధాని మోదీ నియంతగా వ్యవహరిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో బీజేపీకి, ప్రధాని మోదీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. సుమారు రూ.75వేల కోట్లు రాష్ట్రానికి ఇవ్వాలని నిపుణుల కమిటీ కూడా నిర్థారించిందని మంత్రి తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచి రాష్ట్భ్రావృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు.