పశ్చిమగోదావరి

ప్రత్యేక ఆక్వా జోన్ల ఏర్పాట్లపై క్షేత్రస్థాయ పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 18: జిల్లాలో ప్రత్యేక ఆక్వా జోన్ల ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పరిశీలించి, తగు నిర్ణయం తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన మత్స్యశాఖ జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 67 వేల 518 హెక్టార్లలో ఆక్వా పరిశ్రమకు అనువుగా ఉందని, దీనిలో 59 వేల 602 హెక్టార్లలో ఆక్వా ఉత్పత్తులు సాగవుతున్నాయన్నారు. వీటిలో 45 వేల హెక్టార్లలో చేపలు, 21 వేల 951 హెక్టార్లలో రొయ్యలు సాగవుతున్నాయన్నారు. గత సంవత్సరం అక్టోబర్‌లో రాష్ట్ర ఉన్నత స్థాయి కమిటీ సూచనల మేరకు జిల్లాలో ప్రత్యేక ఆక్వా జోన్ల ఏర్పాటుపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఆక్వా జోన్ల ఏర్పాట్లపై ప్రజల నుండి 46 అభ్యంతరాలు వచ్చాయని, వీటిలో 44 అభ్యంతరాలలో ఆక్వా పరిశ్రమకు అనుకూలమైన ప్రాంతాలలోని పరిసరాల్లో సంవత్సరానికి మూడు పంటలు పండే పంట భూములున్నాయని, ఆయా ప్రదేశాల్లో చేపల, రొయ్యల చెరువులకు అనుమతులు ఇవ్వవద్దని కోరారన్నారు. చేపల, రొయ్యల, చెరువులు విడదల చేసే వ్యర్థ పదార్థాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, వాటిని తాగు, సాగునీటి వనరులలోకి వదిలి వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దేశానికే ధాన్యాగారమైన పశ్చిమ గోదావరి జిల్లాలో ధాన్యం, ఆక్వా పరిశ్రమల సమతుల్యతను అంచనా వేసుకునేందుకు జిల్లాలో ఇందుకు సంబంధించి అంశాలన్నింటినీ తాను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ప్రజలు, ఆక్వా రైతు యూనియన్ నాయకులతో జిల్లా స్థాయి కమిటీలో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు.
జాతీయ మత్స్యకారుల సంక్షేమ మండలి జాయింట్ సెక్రటరీ మోహనరాజు మాట్లాడుతూ జిల్లాలో 2 లక్షల టన్నులకు పైగా ఆక్వా ఉత్పత్తులు ఉత్పత్తవుతున్నాయన్నారు. ప్రత్యేక ఆక్వా జోన్ల ఏర్పాట్లలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అంశాలపై కాకుండా వేరే అంశాలను రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.16లో పొందుపరిచిందని, కేంద్ర ప్రభుత్వ సూచనలతో జీవో నెం.16కు సవరణ చేయాలని కోరారు.
జిల్లా స్థాయి కమిటీ సభ్యులు శివాజీ రాజా మాట్లాడుతూ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా చేతికివచ్చిన పంటను చాలా మంది రైతులు కోల్పోతున్నారని, వ్యవసాయం గిట్టుబాటు కాని కారణంగా రైతులు చేపలు, రొయ్యల సాగుకు మొగ్గు చూపుతున్నారన్నారు. రామచంద్రరాజు మాట్లాడుతూ దేశంలోని ఇతర రాష్ట్రాలలో ఆక్వా పరిశ్రమను ఆయా రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీతో ప్రోత్సహిస్తున్నాయని, మన రాష్ట్రంలో కూడా ఆక్వా కల్చర్‌ను ప్రోత్సహించాలన్నారు. కొల్లేరులోని కాలుష్యాన్ని రూపుమాపేందుకు 5 టిఎంసీల మంచినీటితో శుద్ధి చేసినట్లయితే, నాణ్యమైన మత్స్య ఉత్పత్తులతోపాటు ఉత్పాదకత కూడా పెరుగుతుందన్నారు. సత్యనారాయణరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో 960 కిలోమీటర్ల మేర అతి పెద్ద తీరం ప్రాంతం ఉందని, దీని కారణంగా ఆక్వా పరిశ్రమలో మన రాష్ట్రం ప్రగతిని సాధిస్తున్నారన్నారు. ఎంపెడాలో మత్స్య ఉత్పత్తిదారులకు కూడా స్థానం కల్పించవలసిందిగా కోరారు. ఎంపెడా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో ఆక్వా పరిశ్రమలో 3 లక్షల మంది రైతులున్నారని, వీరందరికీ వారి పేర్లు, ఊరు పేరు, పంట విస్తీర్ణం వంటి వివరాలతో స్మార్ట్ కార్డులు అందిస్తున్నామన్నారు. సమావేశంలో మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అంజలి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ గౌసియా బేగం, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు.
పోడుభూములకు అన్నదాత సుఖీభవ పథకం వర్తింపచేయాలని

మున్సిపల్ కార్యాలయం వద్ద...:
ఉగ్రవాద దాడిలో మృతి చెందిన భారత జవాన్లకు నివాళిగా సోమవారం మున్సిపల్ కార్యాలయ సిబ్బంది వౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పారిశుద్ధ్య సూపర్‌వైజర్లు సత్యనారాయణ, లావణ్య, సి ఐ టియు నాయకులు ధనాల రాజు, కె విజయ్, అల్లం పూర్ణిమ, ఏఐటీయూసీ నాయకులు తాడికొండ వాసు తదితరులు పాల్గొన్నారు.
‘అన్నదాత సుఖీభవ’ సొమ్ము బదిలీని పర్యవేక్షిస్తాం
వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్
ఏలూరు, ఫిబ్రవరి 18: జిల్లాలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద విడుదలచేసే తొలివిడత సవమ్ము రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ ప్రక్రియను వ్యవసాయ శాఖ అధికార్లు, బ్యాంకర్ల సమన్వయంతో చేపడతామని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. అమరావతి సచివాలయం ఆర్టీజీఎస్క ఏంద్రం నుండి సోమవారం వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి డి రాజశేఖర్, ఆర్టీజీఎస్ సీఈవో బాబు ఎ ‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమం ఆమలుపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుండి కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ తొలి విడతగా ఒక్కో రైతుకు రూ.వెయ్యి వంతున విడుదల చేసే సొమ్ము వారి వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ అయ్యిందీ లేనిదీ పర్యవేక్షిస్తామన్నారు. జిల్లాలో సుమారు ఆరు లక్షల వరకు ఉన్న రైతులకు సంబంధించిన వివరాలన్నీ సేకరించి, సంబంధిత యాప్‌లో అప్‌లోడ్ చేయడానికి చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్‌ను ఆదేశించారు. భూమి లేని కౌలు రైతులకు సంబంధించిన బ్యాంకు ఖాతా, ఆధార్ నెంబర్లు సేకరించడానికి పటిష్టమైన ప్రణాళికను రూపొందించుకోవాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎల్‌డీఎం పి సూర్యారావు, జేడీఎ గౌసియా బేగం, సీపీవో సురేష్‌కుమార్, డీఎఫ్‌వో రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.