పశ్చిమగోదావరి

ప్రశాంత ఎన్నికలకు రాజకీయ వర్గాలు సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 11: జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు రాజకీయ వర్గాలు పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకివచ్చిన దృష్ట్యా స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులతో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సమావేశం నిర్వహించి ఎన్నికల సక్రమ నిర్వహణకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అందరూ అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ పక్షాలు నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందని, ఎవరైనా ఉల్లంఘిస్తే తగిన చర్యలుంటాయని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నేపధ్యంలో ప్రస్తుత ఓటర్ల జాబితాలోని ఏ ఒక్కరి పేరును తొలగించే ప్రసక్తి ఉండబోదన్నారు. 18 సంవత్సరాలు నిండి ఇంకనూ ఓటుకోసం పేరు నమోదు చేసుకోని వారు, ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మార్చి 15వ తేదీ తరువాత దరఖాస్తు చేసుకునే వారికి ఎన్నికల్లో ఓటువేసే అవకాశం ఉండబోదని కలెక్టర్ స్పష్టం చేశావారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి ప్రజలెవరైనా లక్ష రూపాయలకు మించి సొమ్ము తీసుకువెళ్తుంటే ఆ సొమ్ముకు సంబంధించి ఆధార పత్రాలు చూపించాల్సి ఉంటుందని, సరైన పత్రాలు చూపించకుండా సొమ్ము తీసుకెళితే సీజ్ చేయడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. నిరంతరం ఫ్లయింగ్ స్క్వాడ్‌లు పర్యవేక్షిస్తుంటాయన్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు పత్రికలకు, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాల కోసం చేసే ఖర్చును మీడియా సర్ట్ఫికేషన్ మరియు మోనిటరింగ్ కమిటీ ద్వారా లెక్కించడం జరుగుతుందన్నారు. వివిధ ఛానల్స్‌లో తమ ఎన్నికల ప్రచారం కోసం రూపొందించే అంశాలతో కూడిన సీడీనీ సంబంధిత కమిటీకి నిర్ధిష్ట విధానంలో దరఖాస్తు చేస్తే దానిని పరిశీలించి ప్రసారానికి అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎంఎంసి అనుమతి లేకుండా మీడియా ఛానల్స్‌లో ఎన్నికల ప్రచార ప్రసారాలు చేసేందుకు వీలు లేదన్నారు. లోక్‌సభకు రూ.28 లక్షలు, పార్లమెంటుకు రూ.70 లక్షలకు మించి అభ్యర్థులు ఖర్చు చేయరాదన్నారు. ఎన్నికలకు సంబంధించి ఏమైనా అనుమానాలు నివృత్తి కోసం తనను ఎప్పుడైనా సంప్రదించవచ్చని, జిల్లాకు మంచి పేరు వచ్చేలా ఎన్నికలు సజావుగా జరిగేందుకు తమ సహకారం అందించాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ రాజకీయ పక్షాల ప్రతినిధులను కోరారు.
ఎపిక్ కార్డులు సక్రమంగా అందించాలి
ఓటరుగా నమోదైన వారి ఫొటో ఓటరు గుర్తింపు కార్డులను ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా అందజేయాలని, లేనిపక్షంలో సంబంధిత బిఎల్వోలను సస్పెండ్ చేస్తామని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. ఏ ఓటరుకు సంబంధించిన ఆ ఓటరుకు ఎపిక్ కార్డును బాధ్యతాయుతంగా అందించాలన్నారు. అలా కాకుండా ఇతర ప్రత్యామ్నాయాల ద్వారా వాటిని అందిస్తే సంబంధిత బిఎల్‌వోలు అందుకు మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. జిల్లాలో ఎన్నికల విధులు నిర్వర్తించే హోంగార్డులకు జిల్లా ఎస్పీ ద్వారా డ్యూటీ సర్ట్ఫికెట్లు తీసుకువస్తే విధుల్లో ఉన్న హోంగార్డులకు పోస్టల్ బ్యాలెట్లు అందించడం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో పోటీచేసే ఎస్సీ అభ్యర్థులకు అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాలను త్వరితగతిన అందించేందుకు సంబంధిత ఆర్డీవోలు తదితరులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జేసీ ఎం వేణుగోపాల్‌రెడ్డి, ఆర్డీవో ఎన్ సత్యనారాయణ, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య, టీడీపీ తరఫున పాలి ప్రసాద్, బీజేపీ తరఫున కె లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ తరఫున షరీఫ్ రిజారుద్దీన్, వైసీపీ తరఫున బండారు కిరణ్‌కుమార్, బీఎస్పీ తరఫున కారెం లెనిన్, నేతల రమేష్, సీపీఎం నాయకులు చింతకాయల బాబూరావు, డిఎన్‌వి ప్రసాదరావు, సీపీఐ తరఫున డి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.