పశ్చిమగోదావరి

పోలింగ్ సిబ్బందికి విధులు కేటయంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 9: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్ల వారీ విధులను కేటాయిస్తూ మంగళవారం రాత్రి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల నిర్వహణకు మొత్తం 23 వేల మందికి పైగా ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రసైడింగ్, ఇతర పోలింగ్ సిబ్బంది పాల్గొంటున్నారని, వీరందరికీ గతంలో ఏయే నియోజకవర్గాల్లో ఎన్నికల విధులు కేటాయించింది తెలియజేయగా మంగళవారం నిర్వహించిన ర్యాండ్‌మైజేషన్ కార్యక్రమంలో ఆయా సిబ్బందికి ఆయా నియోజకవర్గాల్లోని ఏయే పోలింగ్ స్టేషన్లలో విధులు నిర్వర్తించాల్సింది తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ సాధారణ పరిశీలకులు దేవ్‌దత్ శర్మ, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం, సాధారణ పరిశీలకులు సంజీబ్‌కుమార్ దాస్, ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం సాధారణ పరిశీలకులు ఎంజె ప్రదీప్‌చంద్రన్, చింతలపూడి నియోజకవర్గ సాధారణ పరిశీలకులు డాక్టర్ జై కృష్ణ అబీర్, డిఆర్వో ఎన్ సత్యనారాయణ పాల్గొన్నారు.

మాట నిలబెట్టుకోని బాబు
* నరసాపురం ఎంపీ బీజేపీ అభ్యర్థి మాణిక్యాలరావు
తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 9: జిల్లా అభివృద్ధి కోసం ప్రజలకిచ్చిన మాటను తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విస్మరించారని నరసాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి పైడికొండల మాణిక్యాలరావు విమర్శించారు. మంగళవారం పట్టణ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రత్యేక వాహనంపై నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసమే బాబు పనిచేస్తున్నారని విమర్శించారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం నెరవేర్చలేదన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధికి ఇచ్చిన హామీలను విస్మరించారన్నారు. విమానాశ్రయ భూముల్లో ఇళ్లపట్టాలు, విద్యాసంస్థల ఏర్పాటుకు జీవోలు జారీచేసినా వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. జీవోలను తెలుగుదేశం నేతలు అడ్డుకున్నారన్నారు. జిల్లా ప్రజలకు బాబు ద్రోహం చేశారన్నారు. కేంద్ర సహకారంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రధాని ఆవాస్ యోజనతోపాటు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రధాని మోదీ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కేంద్రం సహకారంతో నిట్ సాధించామన్నారు. నరసాపురం ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తామన్నారు. పాతూరు, మసీదు సెంటర్, సత్యవతినగర్, చెట్లరోడ్, గాంధీనగర్, వీకర్స్‌కాలనీ, గణేష్‌నగర్, బాపూజీపుంత, రామారావుపేట, సిపాయిపేట, మిలటరీకాలనీ, కొండయ్య చెరువు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కర్ణాటక నాయకులు బి కాశీవిశ్వనాథం, బీజేపీ నాయకులు ఈతకోట తాతాజీ, టి భోగేశ్వరరావు, నరిశే సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.