పశ్చిమగోదావరి

అపర భగీరథుడు కాటన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 15 : అపర భగీరధుడుగా పేరుగాంచిన సర్ ఆర్ధర్ కాటన్ జల స్ఫూర్తిని ఎంత కీర్తించినా తక్కువేనని రాష్ట్ర గనులు, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. లింగపాలెం మండలం అయ్యపరాజుగూడెంలో ఆదివారం కాటన్ 213వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సముద్రం పాలవుతున్న జీవ జలాలకు ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించి కాలువ వ్యవస్థ ద్వారా నడక నేర్పించిన మహనీయుడు కాటన్ అన్నారు. గోదావరి జిల్లాలు సుభిక్షంగా వున్నారంటే దానికి కాటనే కారణమని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అంతగా అందుబాటులో లేని కాలంలో తన మేధాశక్తితో కేవలం అయిదు సంవత్సరాల్లో ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించి గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేశారన్నారు. కార్యక్రమంలో జడ్పీటిసి సభ్యుడు గుత్తా సాయి సత్య వరప్రసాద్, ఎంపిపి మోరంపూడి మల్లికార్జునరావు, గ్రామ సర్పంచ్ దాసరి సురేఖ, ఎంపిటిసి సుశాని లావణ్య, తహశీల్దార్ సోమశేఖర్, ఎంపిడివో కృష్ణకుమారి, జల వనరుల శాఖ ఇఇ సతీష్‌కుమార్, డిఇ రఘునాధ్ పాల్గొన్నారు.