పశ్చిమగోదావరి

రూ.67.36 కోట్లతో నీరు-చెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 15 : జిల్లాలో భూగర్భజలాలను మెరుగుపరిచేందుకు చేపట్టిన నీరు - చెట్టు కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది రూ. 67 కోట్లతో 374 చెరువుల పూడికతీత పనులు చేపట్టినట్లు రాష్ట్ర గనులు, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత చెప్పారు. ఆదివారం చింతలపూడిలోని పెద్దచెరువు పూడికతీత పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంత వరకు 310 పనులకు సంబంధించి టెండరు ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందన్నారు. వీటిలో 181 పనులు పురోగతిలో వుండగా 20 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని నిర్వహించారన్నారు. చింతలపూడిలో ఈ పధకం కింద రూ. 10 కోట్ల విలువైన పనులుచేపట్టామన్నారు. జిల్లాలోని మెట్ట ప్రాంతంలో భూగర్భజలాల మట్టాలు అడుగంటాయని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు నీరు - ప్రగతి, పంట సంజీవని కుంటలు, ఇంకుడుగుంతల తవ్వకం పనులు ఉద్యమ రూపంలో చేపట్టాల్సిన అవసరం వుందన్నారు. జిల్లాలో 80 వేల పంట కుంటలు, ఏడు లక్షల ఇంకుడుగుంతలు తవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. ఈ నెలాఖరునాటికి చింతలపూడి నియోజకవర్గంలో అయిదు వేల ఇంకుడుగుంతలు తవ్వకం పనులు పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. తొలుత ప్రొక్లెయినర్ నడిపి ఆమె పెద్ద చెరువు పూడిక తీత పనులు ప్రారంభించారు. తొలుత సర్ ఆర్ధర్ కాటన్ 213వ జయంతి సందర్భంగా కాటన్ చిత్రపటానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీటిసి తాళ్లూరి రాధారాణి, ఎంపిపి దాసరి రామక్క, సర్పంచ్ మారిశెట్టి జగదీశ్వరరావు, ఎంపిటిసి సుందరమ్మ, జలవనరుల శాఖ ఇ ఇ సతీష్‌కుమార్, డి ఇ రఘునాధ్, స్థానిక నాయకులు పట్ట్భా, పెదబాబు పాల్గొన్నారు.
అధికారుల గైర్హాజరుపై ఆగ్రహం
చింతలపూడిలో ఆదివారం జరిగిన పలు కార్యక్రమాలకు మండల స్థాయి అధికారులు అందుబాటులో లేకపోవడం పట్ల రాష్ట్ర గనులు, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీరు - చెట్టు కార్యక్రమం ప్రారంభానికి ఆదివారం చింతలపూడి వచ్చిన మంత్రికి తహశీల్దారు, ఎంపిడివోలు కనిపించలేదు. అదే విధంగా ఇతర కార్యక్రమాల్లో కూడా వారు కనపడకపోవడంతో తహశీల్దార్ మైఖేల్‌రాజు, ఎంపిడివో రాజశేఖర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇవో ఆర్‌డి గోపాలరావు సమావేశానికి హాజరుకావడంతో ఎంపిడివో ఎవరికి చెప్పి సెలవు పెట్టారని నిలదీశారు. మంత్రిగా తాను ఇక్కడకు వచ్చినప్పుడు బాధ్యత గల అధికారులు ఎవ్వరూ లేకపోతే ఎలా అంటూ అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందని, వాటిని పరీక్షించేందుకు తాము వస్తే అధికారులు అందుబాటులో లేకపోవడం విచారకరమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు అందుబాటులో లేకపోతే ఏ విధంగా చర్యలు తీసుకుంటామని ఆమె ప్రశ్నించారు.