పశ్చిమగోదావరి

ధాన్యం సేకరణలో ప్రథమ స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాగల్లు, మే 19: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జెసి పి కోటేశ్వరరావు అన్నారు. గురువారం చాగల్లు తహసీల్దార్ కార్యాలయంలో 1424 ఫసలీ జమాబందీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేఖరులతో జెసి మాట్లాడుతూ 17 లక్షల 18 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ప్రభుత్వ లక్ష్యం కాగా ఇప్పటివరకు 9 లక్షల ఒక వెయ్యి 114 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్టు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటివరకు 32 వేల 179 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. రైతులకు ధాన్యం తోలిన 3 రోజుల్లో సొమ్ము చెల్లించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. రవాణా ఛార్జీలు ధాన్యం రవాణా చేసిన యజమానికి చెల్లిస్తున్నట్టు తెలిపారు. రైతులకు చెల్లింపులో బకాయిలు లేవన్నారు. రాష్ట్రంలో రూ.1300 కోట్లు రైతులకు చెల్లించవలసి ఉండగా రూ.1236.5 కోట్లు చెల్లించినట్టు తెలిపారు. ఈ మూడు రోజులకు 64 కోట్లు చెల్లించవలసి ఉందన్నారు. తుపాను ప్రభావం ఎదుర్కోవటానికి సిబ్బందిని అప్రమత్తం చేసి అన్ని చర్యలు తీసుకొనే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులకు గండ్లు పడకుండా రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలిచ్చామన్నారు.కొవ్వూరు డివిజిన్‌లో 78 మందికి కొత్త రేషన్ షాపులు మంజూరైనా ఈ మిషన్‌ల కొరత వలన ప్రారంభించటానికి ఆదేశాలు ఇవ్వలేదని, త్వరలో 60 శాతం ప్రారంభోత్సవానికి ఆదేశిస్తామన్నారు. రైతుకు బ్యాంకు రుణాల్లో జాప్యం లేకుండా ఈ పాస్ పుస్తకంలోనే టైటిల్ డీడ్ ఉండే విధంగా ప్రభుత్వ నిర్ణయించిదన్నారు. ఈ రేషన్ ద్వారా జిల్లాలో 92.4 శాతం రేషన్ పంపిణీ జరిగిందన్నారు. నూరుశాతం పంపిణీకి లోపాలను సరిచేసి చర్యలు తీసుకొంటామన్నారు. నిత్యావసర పప్పుల ధరలు మార్కెట్లో ఎక్కువగా ఉండటంలో గత సంవత్సర ఈ నెలనాటి రేటుకి రైతుబజార్లలో ప్రతీ ఒక్కరికి కిలో చొప్పున కంది, మినప, పెసర అందించడానికి టోకు వ్యాపార వర్గాలతో మాట్లాడి ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ రేషన్ ద్వారా రాష్ఠ్రంలో ఎక్కడివారు ఎక్కడినుండైనా రేషన్ పొందవచ్చునన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎం మెరికమ్మ, సీనియర్ సహాయకులు కె అజయబాబు విఆర్వోలు పాల్గొన్నారు.