పశ్చిమగోదావరి

గాఢాంధకారంలో వీరవాసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరవాసరం, మే 19: వీరవాసరం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో గత 36 గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గాఢాంధకారం నెలకొంది. బుధవారం ఉదయం నుంచి గురువారం రాత్రి 10 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గాలివాన రావడంతో సబ్‌స్టేషన్ పరిధిలో గల పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో తాగునీరు సరఫరా కూడా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం రాత్రి సంభవించిన గాలివాన వల్ల అనేక ప్రాంతాల్లో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. విద్యుత్ సిబ్బంది తక్కువగా ఉండటంతో పనులను చేయలేకపోయారు. అయితే తాగునీటి కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. విద్యుత్ సరఫరా ఎప్పుడు పునరుద్ధరణ అవుతుందో ఎపి ట్రాన్స్ ఎఇ శ్రీనివాసరాజు కూడా చెప్పకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్‌స్టేషన్ పరిధిలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో విద్యుత్ ఉండటంతో ప్రజలు విద్యుత్ అధికారుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్‌స్టేషన్‌కు ఫోన్ చేసినప్పటికీ సరైన సమాధానం రాకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.